NPS Withdrawal Rule: కొత్త రూల్స్.. సరికొత్త ప్రయోజనాలు.. ఇక వారికి పండగే.. వివరాలు ఇవి..

|

Jun 09, 2023 | 5:15 PM

నేషన్ పెన్షన్ స్కీమ్ సబ్ స్క్రైబర్స్ కోసం పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. దీనికి సిస్టమేటిక్ లంప్సమ్ విత్ డ్రాల్స్(ఎస్ఎల్డబ్ల్యూ) అని పేరు పెట్టింది.

NPS Withdrawal Rule: కొత్త రూల్స్.. సరికొత్త ప్రయోజనాలు.. ఇక వారికి పండగే.. వివరాలు ఇవి..
Nps
Follow us on

సురక్షిత పదవీవిరమణ పెట్టుబడి పథకాలలో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి. కేంద్ర ప్రభుత్వ భరోసా ఉండే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అందరూ ఆసక్తి చూపుతారు. అయితే దీనిలో ఖాతా ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దీనిలో ఉండే కొన్ని నిబంధనలను మార్పు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా ఖాతాదారులకు నగదు ఉపసంహరణ సులభం అవడంతో పాటు కొంత అధిక వెసులుబాటు కూడా కలుగుతుంది. నేషన్ పెన్షన్ స్కీమ్(ఎన్ పీఎస్)లో ప్రభుత్వం తీసుకురావాలనుకొంటున్న కొత్త రూల్ ఏంటి? దాని వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? తెలుసుకుందాం రండి..

నేషన్ పెన్షన్ స్కీమ్ సబ్ స్క్రైబర్స్ కోసం పెన్షన్ ఫండ్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. దీనికి సిస్టమేటిక్ లంప్సమ్ విత్ డ్రాల్స్(ఎస్ఎల్డబ్ల్యూ) అని పేరు పెట్టింది. దీని ద్వారా ఖాతాదారుడు తాను పెట్టిన పెట్టుబడి నుంచి నగదును తన అవసరాలకు అనుగుణంగా ఇన్ స్టాల్ మెంట్స్ మార్గంలో ఉపసంహరించుకోవచ్చు. ఈ సందర్భంగా పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ దీపక్ మహంతి మాట్లాడుతూ ఈ సిస్టమాటిక్ లప్సమ్ విత్ డ్రాల్ ఫెసిలిటీ ద్వారా ఎన్పీఎస్ ఖాతాదారులు వారి ఇష్టానుసారంగా నగదు విత్ డ్రాల్స్ చేయచ్చన్నారు.

ఇప్పటి వరకూ ఇలా..

ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం పొందాల్సి ఉంటుంది. అంటే పెన్షన్ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. తర్వాత మిగిలిన మొత్తాన్ని ఒకేసారి పొందొచ్చు. పెన్షన్ ప్లాన్‌ను మెచ్యూరిటీ అమౌంట్‌లో కనసీం 40 శాతాన్ని పెట్టి పెన్షన్ ప్లాన్ కొనాలి. ఇక మిగిలిన 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారికి రూల్స్ వర్తిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇకపై ఇలా..

సిస్టమ్యాటిక్ లంప్ సమ్ విత్‌డ్రాయెల్ ఆప్షన్ ప్రకారం మెచ్యూరిటీ మొత్తాన్ని ఒకేసరి కాకుండా విడతల వారీగా కూడా పొందొచ్చు. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున మీరు డబ్బులను విత్‌డ్రాయెల్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే ఆప్షన్ ఆధారంగా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఇలా 75 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు పొందొచ్చు. అందువల్ల దీని వల్ల కూడా రాబడి పొందొచ్చు. అందువల్ల ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారికి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తే చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..