ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రజల్లో బాగా ఆదరణ పొందాయి. ప్రజలకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకాన్ని ప్రారంభించేందుకు చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపుతుంటారు. ఇదే క్రమంలో పలు ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్ కంపెనీలు అత్యధిక వడ్డీని అందిస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎఫ్ఎస్ఎఫ్బీ) కూడా ఫిక్స్ డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఫిన్ కేర్ వినియోగదారులకు కనీసం రూ. 5000 విలువైన ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 8.51శాతం వరకూ, సీనియర్ సిటిజెన్స్ కు అయితే ఏకంగా 9.11శాతం వడ్డీని అందిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు 2023, మే 25 నుంచి అమలవుతున్నట్లు పేర్కొంది.
ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ రాజీవ్ యాదవ్ మాట్లాడుతూ తమ బ్యాంకు వినియోగదారులకు అవసరమైన విధంగా సేవలకు అందిస్తుందన్నారు. అదే ఇప్పుడు ఈ ఎఫ్ డీ రేట్లపై చూపించిందన్నారు. షార్ట్ టర్మ్ లేదా లాంగ్ టర్మ్ ఆర్థిక లక్ష్యాలను అధిగమించేందుకు తమ బ్యాంకు మంచి వడ్డీ రేట్లను అందిస్తుందన్నారు. ఏడు రోజుల నుంచి 10ఏళ్ల వరకూ వివిధ కాల వ్యవధుల్లో మంచి వడ్డీతో కూడిన ఎఫ్డీలను అందిస్తున్నామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..