Electric Scooter: సరికొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్.. అత్యాధునిక డిజిటల్ ఫీచర్లతో త్వరలో లాంచ్..

|

May 06, 2023 | 6:00 PM

ఓజోటెక్ ఫ్లీయో పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లోకి త్వరలో రానుంది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రేంజ్, ఫీచర్లను అందిస్తోంది. అంతేకాక డిజైన్ కూడా వినియోగదారుల సూచనల ఆధారంగానే స్కూటర్ డిజైన్ రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది.

Electric Scooter: సరికొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్.. అత్యాధునిక డిజిటల్ ఫీచర్లతో త్వరలో లాంచ్..
Ozotec Flio
Follow us on

ఇండియన్ ఆటో మార్కెట్లోకి విద్యుత్ శ్రేణి వాహనాలు క్యూ కడుతున్నాయి. పెద్ద కంపెనీల నుంచి, చిన్ని చిన్న స్టార్టప్ ల వరకూ సూపర్ రేంజ్, సన్నింగ్ డిజైన్ తో తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఓజోటెక్ ఫ్లీయో పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లోకి త్వరలో రానుంది. ఇది వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రేంజ్, ఫీచర్లను అందిస్తోంది. అంతేకాక డిజైన్ కూడా వినియోగదారుల సూచనల ఆధారంగానే స్కూటర్ డిజైన్ రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది.

వివరాలు ఇవి..

ఓజోటెక్ ఫ్లీయో ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన ఎటువంటి వివరానలు కంపెనీ ప్రకటించలేదు. రేంజ్, ఫీచర్లు వంటివి పూర్తి స్థాయిలో వివరించలేదు. అయితే మార్కెట్ వర్గాల ప్రచారం ప్రకారం దీని రేంజ్ చాలా అధికంగా ఉంటుంది. దీనిలో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ చేయడానికి ఆరు గంటలు పడుతుంది. అలాగే మోటార్ కూడా బీఎల్డీసీ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ ఈ స్కూటర్ లో అందించారు.

ఫీచర్లు ఇవి..

ఈ స్కూటర్లో డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, ఎల్ఈడీ లైట్లు, స్టార్ట్ బటన్, యూఎస్బీ పోర్టు, మొబైల్ కనెక్టవిటీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. డిస్క్ బ్రేకులు ఉండే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ధర, లభ్యత..

ఓజోటెక్ ఫ్లీయో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మన దేశంలో రూర. 1,13,518 నుంచి 1,32,990 వరకూ ఉండే అవకాశం ఉంది. ఇది ఐదు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుందని సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..