Electric Scooter: ‘ఇన్ఫినిటీ’ ఫీచర్లతో అదరగొడుతున్న స్కూటీ.. సింగిల్ చార్జ్‌పై 85కి.మీ. పూర్తి వివరాలు
బౌన్స్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఇన్ఫినిటీ ఈ1 పేరిట వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనువైన బడ్జెట్ లో అందుబాటులో ఉండనుంది. బజాజ్, ఓలా, ఏథర్, టీవీఎస్ కంపెనీలకు పోటీగా అతి తక్కువ ధరలోనే బౌన్స్ కంపెనీ స్కూటర్ ను లాంచ్ చేసింది.

మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల బూమ్ నెలకొంది. వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా తోడవడంతో పెద్ద ఎత్తున ఉత్పత్తులను కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఇదే కోవలో బౌన్స్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఇన్ఫినిటీ ఈ1 పేరిట వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనువైన బడ్జెట్ లో అందుబాటులో ఉండనుంది. బజాజ్, ఓలా, ఏథర్, టీవీఎస్ కంపెనీలకు పోటీగా అతి తక్కువ ధరలోనే బౌన్స్ కంపెనీ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర అందుబాటులోనే ఉంటుందని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు ఇప్పుడు చూద్దాం..
సామర్థ్యం ఇలా.. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ స్కూటర్ 1.9 కిలోవాట్ అవర్ సామర్థ్యంతో లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిలో 1500 వాట్ల సామర్థ్యం కలిగిన మోటార్ ఉంటుంది. దీనిలో బ్యాటరీ నాలుగు గంటల సమయంలోనే 100 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. దీనిలో స్వాపబుల్ బ్యాటరీ ఉంటుంది. అంటే ఒక బ్యాటరీ చార్జ్ అయిపోగానే మరొకటి వినియోగించుకోవచ్చు.
ఫీచర్లు.. ఈ స్కూటర్ స్టైలిష్ రెట్రో లుక్ లో ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ లైట్లు ఉంటాయి. రెండు ప్రొజెక్టర్ సెట్టింగ్స్ ఉంటాయి. హై బీమ్, లోబీమ్ ఆప్షన్లలో దీనిని వినియోగించుకోవచ్చు. అలాగే ఎల్ఈడీ టైల్ లైట్లు కూడా ఉంటాయి. అలాగే అనేక రకాల యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉన్నాయి. ఎల్సీడీ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టవిటీ, జీపీఎస్, డ్రైవర్ అనలాగ్ సిస్టమ్ ఉంటుంది.



ధర ఎంతంటే.. ఈ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 54,443 నుంచి రూ. 88,478 వరకూ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ 65 గంటకు కిలోమీటర్లు. ఓలా ఎస్ 1, టీవీఎస్ ఐ క్యూబ్ మాదిరి పనితీరుని ఈ బైక్ అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..