Electric Bike: రేసింగ్ లుక్‌లో ఈ-బైక్.. సింగిల్ చార్జ్‌పై 180 కిలోమీటర్లు.. ఫీచర్లు సూపరంతే..
స్విచ్(svitch) కంపెనీ అట్రాక్టివ్ లుక్‌లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. దీని పేరు స్విచ్ సీఎస్‌ఆర్ 762. ఈ స్విచ్ కంపెనీ 2018లో ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి తన కంటూ ఓ ప్రత్యేకమైన ప్లాట్ ఫారంను సెట్ చేసుకుంది. యూనిక్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో బైక్‌లను అందిస్తోంది.

భవిష్యత్తు అంతా విద్యుత్ శ్రేణి వాహనాలదే. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ చూస్తే ఇదే అనిపిస్తోంది. అన్ని దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలక్ట్రిక్ వేరియంట్లో లాంచ్ చేస్తున్నాయి. అలాగే పలు స్టార్టప్‌లు కూడా మేమూ ఉన్నామంటూ సరికొత్త లుక్, అత్యాధునిక ఫీచర్లతో కొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో స్విచ్(svitch) కంపెనీ అట్రాక్టివ్ లుక్‌లో కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది. దీని పేరు స్విచ్ సీఎస్‌ఆర్ 762. ఈ స్విచ్ కంపెనీ 2018లో ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి తన కంటూ ఓ ప్రత్యేకమైన ప్లాట్ ఫారంను సెట్ చేసుకుంది. యూనిక్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో బైక్‌లను అందిస్తోంది. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సూపర్‌స్టార్ సల్మాన్ యూసఫ్ ఖాన్ ఉన్నారు. ఇప్పుడు ఈ స్విచ్ సీఎస్‌ఆర్ 762 బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్టన్నింగ్ లుక్..
ఈ స్విచ్ సీఎస్‌ఆర్ 762 బైక్ గుజరాత్‌కు చెందిన ఏసియాటిక్ లయన్స్ నుంచి ప్రేరణ పొందింది. లగ్జరీ, స్టైల్, స్థిరత్వం ఎందులోనూ రాజీపడకుండా ఈ బైక్‌ను తయారు చేశారు. దీనిలో ఐదు మోడ్లు ఉన్నాయి. రివర్స్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, పార్కింగ్ మోడ్‌తో పాటు మరో 3 డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. ఇవి రైడర్‌లకు అద్భుతమైన ఆన్-రోడ్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ బరువు 155 కిలోలు, ఇది సుమారు 200 కిలోల బరువును మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వీల్‌బేస్ 1,420ఎంఎం, సీట్ ఎత్తు 780ఎంఎం. అలాగే దీనిలో హెల్మెట్ పెట్టుకునేందుకు 40లీటర్ల ఫ్రంట్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంది.
పీచర్లు..
ఈ బైక్ సెల్‌ఫోన్ చార్జర్ కనెక్షన్‌తో వస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఐఓఎస్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ను కలిగి ఉంటుంది. దీనిలో యూఎస్‌బీ పోర్టు ఉంటుంది. సెల్ ఫోన్ హోల్డర్ ఉంటుంది. భద్రతా ఫీచర్ల గురించి చూస్తే రెండు రకాల భద్రతా ఫీచర్లు దీనిలో ప్రత్యేకంగా ఉన్నాయి. యాక్టివ్ థర్మల్ మేనేజ్‌మెంట్: ఇది బైక్‌ను వేడెక్కకుండా కాపాడుతుంది. బ్యాటరీ 1500 కంటే ఎక్కువ ఛార్జింగ్ సైకిల్‌లను నిర్వహించగల IP*9 ప్రోటెక‌్షన్‌ను కలిగి ఉంటుంది. ఎలక్ట్రికల్ మాల్ ఫంక‌్షనింగ్ ప్రోటెక‌్షన్: ఇది బైక్ సాఫ్ట్‌వేర్ ను కాపాడుతుంది. వినియోగదారునికి సరైన సమాచారాన్ని అందివ్వడంలో సాయపడుతుంది.



రేంజ్, స్పెసిఫికేషన్లు..
ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 3 kw సామర్థ్యంతో కూడిన మోటార్ ఉంటుంది. ఇది 10 10 kW, 3 ,800 rpm పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. 3.6 kWh లిథియం-అయాన్, నికిల్-మాంగనీస్-కోబాల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్‌పై 180 కిమీ పరిధిని అందిస్తుంది. అయితే మీరు డ్రైవ్ చేసే మోడ్ ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఈ బైక్ గరిష్టంగా 110కిమీ/గం వేగంతో దూసుకుపోతుంది. బైక్ రెండు బ్యాటరీల సెట్‌తో వస్తుంది,
ధర, లభ్యత..
ఆగస్టు 2022లోనే ప్రకటించిన ఈ బైక్ అంచనా ఎక్స్ షోరూం ధర రూ. 2లక్షల కన్నా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది సర్టిఫికేషన్ స్టేజ్‌లో ఉంది. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ ధర దాదాపు 1.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ సబ్సిడీ అందిస్తే రూ. 40,000 వరకు తగ్గుతుంది. అప్పుడు ఇది రూ. 1.25 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులోకి వస్తుంది. 2023 చివరి నాటికి ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
