
మన దేశంలో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ప్రజాదరణను పొందుతున్నాయి. అధికమైన సేల్స్ రాబడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటు కొత్త కంపెనీలు కూడా మార్కెట్లో తమ ఉత్పత్తులతో అడుగుపెడుతున్నాయి. మరికొన్ని కంపెనీలు అప్ డేటెడ్ మోడల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారు కాస్త గందరగోళానికి గురవుతున్నారు. ఎటువంటి ఫీచర్స్ ఉండాలి? స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి? పని తీరు ఎలా ఉంటుందన్న ఆలోచనలు వారికి ఉంటున్నాయి. ఈక్రమంలో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధఇంచిన పూర్తి రివ్యూ మీకు అందిస్తున్నాం. దీని పేరు ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మన మార్కెట్లో రూ. 90,000 ప్రారంభ ధర నుంచి రూ. 1.15లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది. ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, పనితీరుపై సమగ్ర రివ్యూని మీకు అందిస్తున్నాం..
ఇది మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వెస్పా స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో కూడిన రెట్రో డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్ బ్లూ పెయింట్ స్కీమ్, డీఆర్ఎల్ బ్లింకర్‌లు ఆకట్టుకునేలా కనిపిస్తాయి. ఈ స్కూటర్ స్విచ్ గేర్ ప్లాస్టిక్ ప్యానెల్‌లను కలిగి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ హాఫ్ ఓవల్ స్ట్రిప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 10-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై ఆధారంగా నడుస్తుంది. అలాగే గ్రే పౌడర్-కలర్ ఫినిషింగ్తో పెద్ద గ్రాబ్ హ్యాండిల్‌ను కలిగి ఉంటుంది.
ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కేడబ్ల్యూ బీఎల్ఢీసీ మోటారును కలిగి ఉంటుంది. ఇది మంచి పనితీరును అందిస్తుంది. అధిక యాక్సిలరేషన్ బాగుటుంది. అయితే ఇదే కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు దారితీయవచ్చు. ఒకేసారి యాక్సెలరేట్ ఇస్తే ఒకేసారి ముందుకు దూకుతుంది. కాబట్టి రైడర్ జాగ్రత్త వహించాలి. ఈ స్కూటర్లో ఏకో, డ్రైవ్, స్పోర్ట్ అనే మూడు రైడ్ మోడ్‌లు ఉన్నాయి, వీటిని రైడర్‌లు తమ అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఇ-స్కూటర్ స్పోర్ట్స్ మోడ్‌లో 55-60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ ఎలక్ట్రిక్ స్కూటర్ సౌకర్యవంతమైన, కుషన్డ్ సీటును అందిస్తుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉంటాయి. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది, హ్యాండిల్‌బార్ తేలికగా ఉంటుంద.
బ్యాటరీ విషయానికి వస్తే, దీనిలో 2.5 కేడబ్ల్యూ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఏకో మోడ్‌లో 100-110 కిమీ రేంజ్ అందిస్తోంది. స్కూటర్‌తో పాటు వచ్చే పోర్టబుల్ 67.2V 10A ఛార్జర్‌ని బ్యాటరీని 5 గంటల్లో 0-100 శాతం వరకు చార్జ్ చేయవచ్చు.
ఫీచర్ల విషయానికొస్తే, ఈ స్కూటర్లో బ్యాటరీ ఇండికేటర్, టాకోమీటర్, స్పీడోమీటర్ వంటి పరిమిత సమాచారాన్ని ప్రదర్శించే పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. యాంటీ-థెఫ్ట్ స్మార్ట్ లాక్‌ని కలిగి ఉంటుంది. అలాగే నిల్వ కోసం, ఇ-స్కూటర్ ముందు భాగంలో లాకింగ్ ఫంక్షన్‌తో కూడిన గ్లోవ్‌బాక్స్‌ను పొందుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..