
తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఏదైనా మంచి బిజినెస్ ఐడియా గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అతి తక్కువ ప్రారంభ పెట్టుబడితో మంచి రాబడులు పొందాలనుకునేవారికి ఇది బెస్ట్ చాయిస్. అది ఏం బిజినెస్ అంటే ఐస్ క్రీమ్ పార్లర్. పైగా ఈ బిజినెస్ కు ఇది సరైనా సీజన్. ఎందుకంటే వేసవి ప్రారంభమైంది. ఇప్పటికే భానుడు తన ప్రభావం చూపడం ప్రారంభించాడు. వేడి గాలులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో అందరూ చల్లని పానీయాలతో పాటు ఐస్ క్రీమ్ ఎక్కువగా తీసుకోవడానికి మొగ్గుచూపుతారు. దీంతో ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ ను ప్రారంభిస్తే మంచిగా క్లిక్ అయ్యే అవకాశాలుంటాయి. పైగా దీనిలో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువని మార్కెట్ వర్గాలు సైతం చెబుతున్నాయి. అందుకే ఈ వేసవి సీజన్లో ఇది ఎవర్ గ్రీన్ వ్యాపారం. కేవలం వేసవి సీజన్ మాత్రమే కాక.. వర్షాకాలం, సీతాకాలంలో కూడా ఐస్ క్రీమ్ బిజినెస్ కు ఢోకా ఉండదు. ఒక సీజన్ మీ పార్లర్ మంచిగా క్లిక్ అయితే.. ఇక పిల్లలు, పెద్దలు, యువతులు, స్నేహితులు అందరూ పార్లర్ కు వస్తూనే ఉంటారు. దీనికి ప్రతి నెల పెట్టుబడి రూ. 10,000 సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించడానికి అవసరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐస్క్రీం పార్లర్లను ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. దీని కోసం ఒక ఫ్రీజర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకోవాలి. లేదా సొంతంగా అయినా ఓ చిన్న షాపు ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాక 400 నుంచి 500 చదరపు అడుగుల కార్బెట్ ఏరియా కూడా అవసరం అవుతుంది. ఇందులో 5 నుంచి 10 మంది వరకు కూర్చునే ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. అలా చేస్తేనే మీ పార్లర్ కు ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ ప్రారంభించడానికి ముందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నుంచి లైసెన్స్ పొందాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. ఇది మీ పార్లర్ లో తయారు అవుతున్న ఆహార పదార్థాలు ఎఫ్ఎస్ఎస్ఏఐ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది.
2022 నాటికి దేశంలో ఐస్ క్రీం వ్యాపారం ఒక బిలియన్ డాలర్లను దాటింది. రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని పలు ఆన్ లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే ఐస్ క్రీమ్ అంటే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు. వేసవి కాలంలో ఒక వ్యక్తి వీలైనంత త్వరగా తక్కువ డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఐస్ క్రీం పార్లర్ మంచి ఎంపిక. ఈ వ్యాపారం వేసవిలో మాత్రమే నడుస్తుందని కాదు.. ఇప్పుడు చలికాలంలోనూ ఐస్ క్రీం తినాలనే ఆసక్తి పెరుగుతోంది. అందువల్ల, ఈ వ్యాపారంలో మంచి సంపాదనకు అవకాశం ఉంది.
మీరు ఒకవేళ ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ ప్రారంభించాలని భావిస్తే.. మీకు అమూల్ సంస్థ ఓ మంచి అవకాశాన్ని అందిస్తోంది. అమూల్ సంస్థ అందిస్తున్న ప్రాంఛైజీని తీసుకోవచ్చు. ఇందుకోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలాన్ని సంస్థకు చూపించాల్సి ఉంటుంది. మీకు ఇంత స్థలం ఉంటే, ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయడానికి retail@amul.coopకి ఈ-మెయిల్ చేయండి. ఇది కాకుండా, మీరు ఈ లింక్ http://amul.com/m/amul స్కూపింగ్ పార్లర్లను సందర్శించడం ద్వారా కూడా వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..