ఒకప్పుడు బ్యాంకులో లోన్ అంటే అదో పెద్ద ప్రహసనం. అంత సులభంగా మంజూరయ్యేవి కావు. చాలా పలు రకాలు డాక్యుమెంట్లు, ష్యూరిటీలు కావాల్సి వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. లోన్లు చాలా సులువుగా లభ్యమవుతున్నాయి. కేవలం వ్యక్తులు క్రెడిట్ చరిత్రను సూచించే సిబిల్ స్కోర్ ఆధారంగా నిమిషాల్లో రుణాలు మంజూరవుతున్నాయి. ఎటువంటి పత్రాలు, ష్యూరిటీలు అవసరం లేకుండానే అంతా జరిగిపోతోంది. అందుకోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పని కూడా లేకుండా ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల లోన్ యాప్స్ వచ్చాయి. ఇన్ స్టంట్ లోన్ యాప్స్ కేవలం ఒకటి రెండు క్లిక్ లలోనే మీకు కావాల్సిన రుణాన్ని మీ ఖాతాలో జమ చేస్తున్నాయి. అయితే ఇక్కడే చాలా మంది మోసపోతున్నారు కూడా. సులభంగా మంజూరు అవుతున్నాయి కదా అని లోన్లు తీసుకుంటే.. ఆ తర్వాత కొన్ని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు దారుణంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. మరీ ఈ దారుణ యాప్ ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా కొన్ని ప్రధాన అంశాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే సమస్యలు తప్పవు. ఆ అంశాలు ఏమిటో తెలుసుకుందాం..
మీరు ఇన్ స్టంట్ లోన్ కోసం యాప్ లో చూసే ముందు ఆ యాప్ గురించి తెలుసుకోండి. ఆ సంస్థ గురించి నెట్లోనే వెతకండి. ఆ యాప్ ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నారో లేదా చూసుకోండి. అలా చేయకపోతే ఆ యాప్ ద్వారా మోస పోయే అవకాశం ఉంది. అలాగే యాప్ పేరుతో ఏదైనా వెబ్ సైట్ ఉందేమో వెతకాలి. ఒకవేళ వెబ్ సైట్ లేకపోతే లోన్ తీసుకోకపోవడం ఉత్తమం. ఎందుకంటే వెబ్ సైట్ లేకపోతే స్కామ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు. మరీ ముఖ్యంగా మీకు రుణం ఇస్తున్న సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యిందో లేదో తనిఖీ చేసుకోవాలి. సాధారణంగా రుణాలిచ్చే వారు తీసుకునే వారికి గురించి వెతుకుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో రుణదాత గురించి వెతకాల్సి వస్తోంది.
రుణ యాప్ లలో నిబంధనలు సాధారణ బ్యాంకులు, ఆర్థిక సంస్థల కంటే కొంచెం కఠినంగా ఉంటాయి. కొన్ని యాప్స్ నిబంధనలు అయితే ఆర్బీఐ పరిధిలో కూడా ఉండవు. కాబట్టి మీరు ఈఎంఐ కట్టే సమయంలో ఒక నెల ఆగినా.. రికవరీ ప్రక్రియ మీకు ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంది. ఇది మీ సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీని దెబ్బతీస్తుంది.
వడ్డీ రేట్లు అన్ని చోట్లా ఒకేలా ఉండవు. ఒక్కో బ్యాంక్, ఒక్కో సంస్థ, ఒక్కో యాప్ లో ఒకలా ఉంటాయి. ఇన్ స్టంట్ లోన్ వేగంగా, సులభంగా మంజూరవుతున్నప్పటికీ దీనిపై వడ్డీ రేట్లు చాలా అధికంగా ఉంటాయి. అందుకే వివిధ సంస్థల్లో వడ్డీ రేట్లు సరిపోల్చాలి. అన్ని సంస్థల వడ్డీ రేట్లు ఒకే చోట ఆన్ లైన్లో లభిస్తాయి.
రుణాలు తీసుకునే ముందే రుణ చెల్లింపుల గురించి తెలుసుకోవాలి. ఎంత ఈఎంఐ పడుతుంది? ఒకవేళ ఒక ఈఎంఐ కట్టకపోతే పడే పెనాల్టీ ఎంత? డిఫాల్ట్ అయితే పరిస్థితే ఏంటి? వంటి అంశాలను ముందే అడిగి తెలుసుకోవాలి. అలాగే నిర్ణీత కాల వ్యవధికన్నా ముందే రుణం చెల్లించే వెసులుబాటు ఉందా? దానికి ఏమైనా చార్జీలు వసూలు చేస్తారా? ఆలస్య రుసుములు ఏంటి? ప్రాసెసింగ్ చార్జీలు, జీఎస్టీ, ఇతర చార్జీలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి.
రుణ దాతలు వినియోగదారులకు ఎలాంటి సర్వీస్ అందిస్తుందో ముందే తెలుసుకోవాలి. అలాగే ఏదైనా ఆన్ లైన్ పేమెంట్ సమయంలో ఇబ్బంది వచ్చినా.. వారి కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుందో కూడా ముందే తెలుసుకోవాలి. మీ ప్రశ్నలు, సందేహాలు నివృత్తి చేసే వ్యవస్థపై అడగాలి. చాట్, మెయిల్, ఫోన్ ద్వారా మీకు త్వరితగతిన సేవలు లభించే రుణ గ్రహీతను ఎంచుకోవడం మేలు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..