Petrol Price: అక్కడ పెట్రోల్ చాలా చీప్.. లీటర్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

|

Mar 20, 2024 | 6:23 AM

మీకు తెలుసా.. మన దేశంలోని ఒక ప్రాంతంలో లీటర్‌ పెట్రోలు కేవలం రూ. 82 కే లభిస్తుంది. అక్కడ డీజిల్‌ కూడా చౌకగా అందుబాటులో దొరుకుతుంది. కేవలం రూ.78 చెల్లించి లీటర్‌ డిజిల్‌ కొట్టించుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో పెట్రోలు ధర మండిపోతుంటే అక్కడ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంది. అదే అండమాన్‌ నికోబార్‌ దీవులు. మరి అత్యధికంగా ఎక్కడుందో తెలుసా? అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ధరల వివరాలను కూడా తెలుసుకుందాం.

Petrol Price: అక్కడ పెట్రోల్ చాలా చీప్.. లీటర్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Petrol, Diesel
Follow us on

మీకు తెలుసా.. మన దేశంలోని ఒక ప్రాంతంలో లీటర్‌ పెట్రోలు కేవలం రూ. 82 కే లభిస్తుంది. అక్కడ డీజిల్‌ కూడా చౌకగా అందుబాటులో దొరుకుతుంది. కేవలం రూ.78 చెల్లించి లీటర్‌ డిజిల్‌ కొట్టించుకోవచ్చు. అన్ని రాష్ట్రాల్లో పెట్రోలు ధర మండిపోతుంటే అక్కడ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంది. అదే అండమాన్‌ నికోబార్‌ దీవులు. మరి అత్యధికంగా ఎక్కడుందో తెలుసా? అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ధరల వివరాలను కూడా తెలుసుకుందాం.

ధరలు పెరిగితే దడే..

పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయంటూ వార్తలు వస్తే సామాన్య, మధ్య తరగతి ప్రజల గుండెల్లో కంగారు పుడుతుంది. అవి ఎంత పెరిగాయో తెలుసుకుని ఆందోళన చెందుతారు. ఎందుకంటే రవాణా వ్యవస్థకు కీలకమైన పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయంటే నిత్యావసరాల నుంచి అన్ని వస్తువుల ధరలు ఆటోమేటిక్‌గా పెరిగిపోతాయి. మన నెలవారీ బడ్జెట్‌ను సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ప్రజలకు ఆసక్తి..

సాధారణంగా పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజలకు ఎంతో ఆసక్తి ఉంటుంది. మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వీటి ధరల్లో వ్యత్సాసం ఉంది. స్థానిక అమ్మకపు పన్ను లేదా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కారణంగా ధరలలో ఈ తేడాలున్నాయని చమురు పరిశ్రమల నివేదికలు చెబుతున్నాయి. పెట్రోలు ధర రోజురోజుకూ పెరగడమే కానీ తగ్గడాన్ని మనం చాలా అరుదుగా చూస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోలు, డీజిల్ ధరలను లీటర్ కు రూ.2 తగ్గించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

ఏపీలోనే అధికం..

దేశం మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోలు ధర ఎక్కువ. లీటర్ పెట్రోలు రూ.109.87 దొరుకుతుంది. రెండో స్థానంలో కేరళ కొనసాగుతోంది. అక్కడ లీటర్ పెట్రోలు రూ.107.54కు లభిస్తుంది. ఆ తర్వాత తెలంగాణలో రూ.107.39, మధ్యప్రదేశ్‌ రూ.106.45, బీహార్‌లో రూ.105.16, రాజస్థాన్ లో రూ.104.86, మహారాష్ట్రలో రూ.104.19, పశ్చిమ బెంగాల్‌లో రూ.103.93, ఒడిశాలో 101.04, తమిళనాడులో రూ.100.73, ఛత్తీస్‌గఢ్ లో రూ.100.37లకు విక్రయిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో రూ.వంద కంటే తక్కువ..

దేశంలో వంద రూపాయలంటే తక్కువ ధరకు పెట్రోలు దొరుకుతున్న ప్రాంతాల గురించి తెలుసుకుందాం. అసోం రాష్ట్రంలో లీటర్ పెట్రోలు రూ.96.12కు లభిస్తుంది. మిజోరంలో రూ.93.68, గోవాలో రూ.95.19, ఢిల్లీలో రూ.94.76 పలుకుతుంది. ఇక దేశంలో అత్యంత చౌకగా పెట్రోలు లభిస్తున్న ప్రాంతం అండమాన్ నికోబార్ ద్వీపం. ఇక్కడ కేవలం రూ.82కే లీటర్ పెట్రోలు దొరుకుతుంది.

డీజిల్‌ ధరల వివరాలు..

దేశంలోని వివిధ ప్రాంతాల్లో డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి. డీజిల్‌ లీటర్‌ ధరలు రూ. వంద కన్నా తక్కువుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రూ.97.6, కేరళలో రూ. 96.41. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఒడిశా, జార్ఖండ్‌ రా​‍ష్ట్రాల్లో రూ.92 నుంచి రూ.93 మధ్య ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.87.66, గోవాలో రూ.87.76కు విక్రయిస్తున్నారు. అండమాన్, నికోబార్ దీవిలో డీజిల్ అత్యంత చౌకగా ఉంది, ఇక్కడ లీటరు రూ.78కే లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..