Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Block Debit Card: డెబిట్ కార్డు పోయిందా? ఇంట్లో నుంచే ఇలా బ్లాక్ చేయండి.. చాలా ఈజీ..

ఇంట్లో నుంచే మీరు పోగొట్టుకున్న కార్డును బ్లాక్ చేయొచ్చు. మీరు ఒకవేళ స్టేట్ బ్యాంకు వినియోగదారులు అయితే మీకు మరిన్ని విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఆ విధానాలు ఏంటి? ఎలా చేయాలి? అన్నింట్లో సులభమైనది, వేగవంతమైనది ఏంటి? చూద్దాం రండి..

Block Debit Card: డెబిట్ కార్డు పోయిందా? ఇంట్లో నుంచే ఇలా బ్లాక్ చేయండి.. చాలా ఈజీ..
Debit Cards
Follow us
Madhu

|

Updated on: Jun 26, 2023 | 6:30 PM

బ్యాంకింగ్ రంగం ఎప్పటికప్పుడు కొత్త హంగులను సమకూర్చుకుంటోంది. ఒకప్పుడు దేనికైనా బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి లావాదేవీలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దాదాపు అన్ని పనులు మన ఫోన్లో నుంచే అయిపోతున్నాయి. ఏదైనా పెద్ద లావాదేవీ లేదా ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు మాత్రమే బ్యాంకులకు వెళ్తున్నారు. అయితే ప్రతి బ్యాంకు ఖాతాదారులకు డెబిట్ కార్డు(ఏటీఎం కార్డు) ఇస్తుంది. ఇది వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఏ సమయంలోనైనా నగదు తీసుకునేందుకు ఇది అనుమతి ఇస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కార్డును ఎక్కడో పెట్టి మర్చిపోతారు. లేదా కార్డు ఎవరో కాజేసి ఉంటారు. అటువంటి సమయంలో మీరు ముందుగా చేయాల్సింది కార్డును బ్లాక్ చేయడం. అందుకోసం కస్టమర్ కేర్ కు తక్షణం ఫోన్ చేయడం గానీ లేదా బ్యాంకు పాస్ పుస్తకంతో బ్రాంచ్ వద్దకు వెళ్లి కార్డు బ్లాక్ చేయడం గానీ చేస్తుంటాం. అయితే అంత కష్టం లేకుండా ఇంట్లో నుంచే మీరు పోగొట్టుకున్న కార్డును బ్లాక్ చేయొచ్చు. మీరు ఒకవేళ స్టేట్ బ్యాంకు వినియోగదారులు అయితే మీకు మరిన్ని విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఆ విధానాలు ఏంటి? ఎలా చేయాలి? అన్నింట్లో సులభమైనది, వేగవంతమైనది ఏంటి? చూద్దాం రండి..

ఎస్బీఐ కార్డ్ బ్లాకింగ్.. టోల్ ఫ్రీ నంబర్..

మనకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతుల కంటే వేగంగా, నేరుగా పూర్తయ్యే బెస్ట్ విధానం ఇది. ఎస్బీఐ డెబిట్ కార్డు పోగొట్టుకున్న వెంటనే మీరు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కార్డు బ్లాక్ చేయచ్చు. అందుకోసం మీరు 1800 11 2211, 1800 425 3800 నంబర్లకు ఫోన్ చేసి, ఐవీఆర్ చెబుతున్న సూచనలు పాటిస్తూ కార్డు బ్లాక్ చేసుకోవచ్చు.

ఎస్బీఐ కార్డు బ్లాకింగ్.. ఇంటర్ నెట్ బ్యాంకింగ్..

  • మొదటిగా ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
  • యూజర్ నేమ్, పాస్ వర్డ్ వినియోగించి పర్సనల్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత ఈ సర్వీస్ సెక్షన్ లోకి వెళ్లి దానిలో ఏటీఎం కార్డు సర్వీస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ పై బ్లాక్ ఏటీఎం కార్డు ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి.
  • అప్పుడు మీకు మీ అకౌంట్ పై లింక్ అయ్యి ఉన్న ఏటీఎం కార్డుల జాబితా కనిస్తుంది. దానిలో మీరు బ్లాక్ చేయాలనుకొంటున్న కార్డును ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • మళ్లీ కార్డు వివరాలు సరిచూసుకొని కన్ ఫర్మ్ చేయాలి.
  • ఆ తర్వాత రిక్వెస్ట్ మోడ్ ని ఎంపిక చేసుకోవాలి. మీ ప్రొఫైల్ పాస్ వర్డ్ లేదా ఓటీపీ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓటీపీ ఆప్షన్ పెట్టుకుంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి.
  • ఒక్కసారి ఎస్బీఐ ఏటీఎం డెబిట్ కార్డు బ్లాక్ అయితే మీకు ఎస్ఎంఎస్ ద్వారా టికెట్ నంబర్ వస్తుంది.

ఎస్బీఐ కార్డు బ్లాకింగ్ వయా ఎస్ఎంఎస్..

మెసేజ్ ద్వారా కార్డు బ్లాక్ చేయడానికి.. BLOCK XXXX(డెబిట్ కార్డు చివరి నాలుగు డిజిట్లు) అని టైప్ చేసి 567676కి ఎస్ఎంఎస్ పంపాలి. ఇది పనిచేయాలంటే బ్యాంకు అకౌంట్ కు లింకైన ఫోన్ నంబర్ ను మాత్రమే వాడాలి. బ్యాంకుకు ఎస్ఎంఎస్ వెళ్లిన వెంటనే మీకు ఓ మెసేజ్ వస్తుంది. దానిలో టికెట్ నంబర్, బ్లాకింగ్ టైం, డేట్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈడెన్ వివాదంపై నోరు విప్పిన హర్ష భోగ్లే! చిన్న కథ కాదురా సామీ!
ఈడెన్ వివాదంపై నోరు విప్పిన హర్ష భోగ్లే! చిన్న కథ కాదురా సామీ!
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి
ఈ పండ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే పోషకాలే విషమవుతాయి..
ఈ పండ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే పోషకాలే విషమవుతాయి..
ఈ సీజన్ గంగార్పణం చేసిన ధోని!” చెన్నైపై రాయుడు షాకింగ్ కామెంట్స్
ఈ సీజన్ గంగార్పణం చేసిన ధోని!” చెన్నైపై రాయుడు షాకింగ్ కామెంట్స్
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
LICలో అద్భుతమైన పథకం.. రోజుకు రూ.50 జమ చేస్తే రూ.6 లక్షల బెనిఫిట్
LICలో అద్భుతమైన పథకం.. రోజుకు రూ.50 జమ చేస్తే రూ.6 లక్షల బెనిఫిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
ఖాళీ కడుపుతో వాకింగ్ మంచిదేనా..?
ఖాళీ కడుపుతో వాకింగ్ మంచిదేనా..?
రాత్రిపూట ఇలా తయారు చేసిన పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రాత్రిపూట ఇలా తయారు చేసిన పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు..
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు..