లూలూ గ్రూప్ అధినేతకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. కుప్పకూలిన హెలికాప్టర్.. చిత్తడి నేలలో దిగడంతో..

Helicopter crash-lands: ప్రముఖ వ్యాపారవేత్త, లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ.యూసఫ్‌ అలీ కుటుంబానికి ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్‌

లూలూ గ్రూప్ అధినేతకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. కుప్పకూలిన హెలికాప్టర్.. చిత్తడి నేలలో దిగడంతో..
Lulu Group Chairman Yusuf Ali Helicopter Crash Lands

Updated on: Apr 11, 2021 | 2:57 PM

Helicopter crash-lands: ప్రముఖ వ్యాపారవేత్త, లూలూ గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ.యూసఫ్‌ అలీ కుటుంబానికి ఆదివారం తృటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్‌ కొచ్చి సమీపంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. అయితే ఆ హెలికాప్టర్ చిత్తడి నేలలో దిగడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ల్యాండ్‌ అయిన సమయంలో హెలికాప్టర్‌లో అలీ దంపతులతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ల్యాండింగ్‌ తర్వాత వారందరినీ సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారందరూ వైద్య పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు వెల్లడించారు. హెలికాప్టర్ క్రాష్ అయిన అనంతరం స్థానికులు వారికి సహాయం అందించారు.

ఆసుపత్రిలో చేరిన బంధువును చూడటానికి వారంతా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. పనంగడ్లోని ఫిషరీస్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్ దిగవలసి ఉంది.. కానీ 200 మీటర్ల దూరంలో ఉన్న చిత్తడి నేల మీద హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే.. పక్కనే ఎన్‌హెచ్ బైపాస్, విద్యుత్ లైన్లు ఉన్నాయి. చిత్తడి నేలలోనే హెలికాప్టర్ దిగడంతో.. ప్రణాపాయం తప్పిందని పనాంగడ్ పోలీసులు తెలిపారు. మరేదైనా చోట దిగినట్లయితే.. భారీ ప్రమాదం సంభవించేదని పోలీసులు వెల్లడించారు.

Also Read:

China mine Accident: చైనాలో పోటెత్తిన వరదలు.. బొగ్గు గనిలో గల్లంతైన 21 మంది మైనర్లు..

Health Benefits of Jeera Water: ప్రతిరోజూ జీలకర్ర నీరు తాగితే.. ఈ రోగాలన్నీ మటుమాయమే.. అవేంటంటే..?