దాదాపు మూడు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నానికి చెందిన రైల్వే స్టేషన్ మాస్టర్ కు ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ మహిళతో 2011లో వివాహమైంది. అయితే ఆమె అప్పటికే మరో వ్యక్తిని ప్రేమించడంతో ఈ పెళ్లంటే ఇష్టం లేదు. ఈ కారణంగా వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. వారి దాంపత్య జీవితం సక్రమంగా సాగేది కాదు. స్టేషన్ మాస్టర్ ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేసినా లాభం లేకుండా పోయింది. భార్యభర్తలిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి.
స్టేషన్ మాస్టర్ ఒక రోజు రాత్రి డ్యూటీలో ఉండగా అతడి భార్య కాల్ చేసింది. ఫోన్ లోనే వారిద్దరూ గొడవ పడ్డారు. ఆ సమయంలో స్టేషన్ మాస్టర్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నాడు. తర్వాత మాట్లాడుకుందాం.. ఓకే అని భార్యతో ఫోన్ లో చెప్పాడు. కానీ అదే సమయంలో ఆయన వర్క్ మైక్రో ఫోన్ ఆన్ లో ఉంది. దానిలో స్టేషన్ మాస్టర్ ఓకే అన్న మాటను కోలిగ్ విన్నారు. అప్పటికే గూడ్స్ రైలు పంపేందుకు సిగ్నల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. స్టేషన్ మాస్టర్ ఓకే అన్న మాట విని ఆయన గూడ్స్ రైలుకు వెళ్లడానికి అనుమతి ఇచ్చేశారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతంలో రాత్రి వేళలో రాకపోకలపై నిషేధం ఉంది. కానీ స్టేషన్ మాస్టర్, అతడి భార్య మధ్య జరిగిన గొడవ కారణంగా ఆ ప్రాంతంలోకి రైలు వెళ్లిపోయింది.
దీని వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేనప్పటికీ రైల్వేకు దాదాపు మూడు కోట్ల రూపాయల నష్టం జరిగింది. నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించిన ఆ స్టేషన్ మాస్టర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. భార్య తీరుతో తీరుతో విసిగిపోయిన స్టేషన్ మాస్టర్ విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు దాఖలు చేశాడు. అతడి భార్య కూడా కట్నం వేధింపుల కేసు వేసింది. భర్తతో పాటు మామ, ఆడపడుచును కూడా కేసులో ఇరికించింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపించింది. కేసును విశాఖపట్నం నుంచి దుర్గ్ కు మార్చుకుంది. దుర్గ్ లోని ఫ్యామిలీ కోర్టు స్టేషన్ మాస్టర్ విడాకుల పిటీషన్ ను రద్దు చేసింది. దీంతో ఆయన ఛత్తీస్ గఢ్ హైకోర్టును ఆశ్రయించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి