AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

True caller app: అపరిచితుల గుట్టువిప్పే ట్రూ కాలర్.. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. నిత్యం వివిధ పనులలో మనకు ఎంతో సహయపడుతున్నాయి. వాటి వల్ల సమయం కలిసి రావడంతో పాటు తొందరగా పనులు చేసుకునే అవకాశం కలిగింది. ఆర్థిక లాావాదేవీలు, టిక్కెట్ల బుక్కింగ్, బిల్లుల చెల్లింపులు ఇలా పనినీ చిటికెలో చేయగలుగుతున్నాం. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా బాగా ఎక్కువయ్యాయి.

True caller app: అపరిచితుల గుట్టువిప్పే ట్రూ కాలర్.. ఈ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
True Caller
Nikhil
|

Updated on: Nov 11, 2024 | 7:30 PM

Share

ముఖ్యంగా అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ తో నష్టం కలుగుతోంది. ఈ సమస్య నుంచి పరిష్కారానికి ట్రూ కాలర్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. దాని పనితీరు, ఇతర వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా మన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల నంబర్లను ఫోన్ లోని కాంట్రాక్టు జాబితాలో సేవ్ చేసుకుంటాం. వారి నుంచి కాల్ వస్తే ఫోన్ డిస్ ప్లేలో పేరు కనిపిస్తుంది. ఒక్కోసారి మనం సేవ్ చేయని (అన్ నోన్ నంబర్లు) నంబర్ల నుంచి కాల్స్ వస్తాయి. వాటిని రిసీవ్ చేసుకోవాలో, లేదో తెలియదు. ఆ సమయంలో మనం చాలా బిజీగా ఉండవచ్చు. కానీ ఫోన్ చేసిన వారు ఎవరో తెలియక కంగారు పడతాం. పని మానుకుని రిసీవ్ చేసుకుంటే అది మార్కెటింగ్ లేదా స్పామ్ కాల్ కావచ్చు. ఒక్కోసారి సైబర్ నేరగాళ్లు కూడా ఇలా చేసే అవకాశం ఉంది.

స్టార్ట్ ఫోన్ లో ట్రూ కాలర్ యాప్ ఉండే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ లోన్ కాల్స్ వచ్చినా వారి వివరాలు డిస్ ప్లేలో కనిపిస్తాయి. అంటే ఆ నంబర్ ను మీరు సేవ్ చేసుకోనప్పటికీ ఫోన్ చేసిన వారి పేరు చూపుతుంది. ట్రూ కాలర్ అనేది కాలర్ గుర్తింపు యాప్. దీన్ని స్వీడన్ కు చెందిన ట్రూ సాఫ్ట్ వేర్ శాండినేవియా ఏబీ అనే కంపెనీ రూపొందించింది. ఈ యాప్ నాలుగు ప్రధాన అంశాలపై ఆధారపడి పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి
  • ట్రూ కాలర్ ప్రధానంగా అప్లికేషన్ డౌన్ లోడ్ మీద ఆధారపడుతుంది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న యూజర్ల డేటా సంస్థ కంపెనీ వద్ద స్టోర్ అవుతుంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వినియోగిస్తున్నారు. కాబట్టి వారి పేరు, ఫోన్ నంబర్ కంపెనీ వద్ద ఉంటాయి. కాబట్టి ఏ ఫోన్ నుంచి ఏ ఫోన్ కు కాల్ వెళ్లినా ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి.
  • ఈ యాప్ ను కొందరు డౌన్ లోడ్ చేసుకోపోవచ్చు. అలాంటి వారు కాల్ చేసినా అవతల వారి ఫోన్ల (యాప్ యూజర్లు)లో వివరాలు కనిపిస్తాయి. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి.
  • ఫోన్ డైరెక్టరీ అనేది చాలా పాత వ్యవస్థ. ఇప్పటికీ ఇది చాలా దేశాల్లో అమల్లో ఉంది. పాత పద్దతి అయినా చాలా ఉపయోగంగా ఉంటుంది. దాని సాయంలో అన్ లోన్ నంబర్ల వివరాలు గుర్తిస్తుంది.
  • సోషల్ మీడియాలోని అనేక ప్లాట్ ఫాంలతో ట్రూ కాలర్ జతకట్టింది. వాటిని వినియోగించేవారి డేటా కూడా ఈ యాప్ కు అందుబాటులో ఉంటుంది. వాటి ద్వారా కూడా అన్ లోన్ నంబర్ల వివరాలు తెలుపుతుంది.
  • ఏపీఐ, ఎస్ డీకే అనేక విభిన్న కంప్యూటర్ ప్రోాగ్రామ్ ల సాయంతో కూడా ట్రూ కాలర్ నంబర్లను గుర్తిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి