High breed cashews: కుండల్లో జీడిమొక్కలను పెంచేద్దామా..? హైబ్రీడ్ సీడ్ వచ్చేసిందిగా..!
సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో మొక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలను పండిస్తూ ఉంటారు. వాటి వల్ల నాణ్యమైన కూరలు లభించడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. నగరాల్లో నివసించే వారు తమ డాబాలపై వీటిని సాగు చేస్తుంటారు. ఇప్పుడు ఇదే తరహాలో జీడిమామిడి చెట్లను కుండల్లో పెంచుకునే కొత్త విధానం తెరపైకి వచ్చింది. చిన్న చిన్న కుండల్లో వీటిని పెంచుకుని నాణ్యమైన జీడిపప్పును పొందవచ్చు.
సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం కేవలం ఆహారం తింటే సరిపోదు. అదనపు పోషకాలను కూడా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా జీవిస్తాం. అనారోగ్యాలు దరి చేరకుండా ఉంటాయి. మన ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో డ్రైఫ్రూట్స్ చాలా కీలకం. వాటిలో జీడిపప్పు మనకు అందరికీ తెలిసిందే. దీనిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. విటమిన్ ఇ, బి, కె, కాపర్, జింక్, మెగ్నీషియం తదితర అనేక పోషకాలు లభిస్తాయి. నీటి వసతి తక్కువగా ఉండి, ఎండలు ఎక్కువగా కాసే ప్రాంతాల్లో జీడిమామిడి తోటలు కనిపిస్తాయి. ఏడాదికి ఒకసారి వీటిని దిగుబడి వస్తుంది. జీడిమామిడి పండ్లకు వచ్చే గింజలను సేకరించి, ప్రాసెసింగ్ చేసి జీడిపప్పును తయారు చేస్తారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర,పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది.
ప్రస్తుతం హైబ్రీడ్ జీడి మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఇంటిలో కుండలలో పెంచుకోవచ్చు. రెండు అడుగుల లోతు గల కుండీలను తెచ్చుకోవాలి. వాటిలో మొక్కలను నాటి సంరక్షించాలి. వీటికి ఖర్చు చాలా తక్కువ, సులభంగానే సాగు చేసుకోవచ్చు. హైబ్రీడ్ జీడి మొక్కల ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో పెంచుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం కుండలో వీటిని నాటి, జాగ్రత్తగా చూసుకోవాలి. నాటిన మూడేళ్ల తర్వాత పెరగడం ప్రారంభిస్తాయి. సుమారు ఆరు నుంచి ఏడు సంవత్సరాల తర్వాత ఉత్పత్తి మొదలవుతుంది.
ఒక మొక్క నుంచి దాదాపు ఏడు కిలోల జీడిగింజలు వస్తాయి. ఒక కుండీలో ఐదు మొక్కలు నాటితే సుమారు 40 కిలోల దిగుబడి వస్తుంది. వీటిని ప్రాసెస్ చేసి జీడిపప్పను తీయవచ్చు. తద్వారా ఏడాదికి వేల రూపాయలను ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన, నాణ్యమైన జీడిపప్పును తీనే వీలు కలుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో జీడిపప్పు దాదాపు రూ.1200 వరకూ పలుకుతోంది. జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచింది. చలికాలంలో తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. హైబ్రీడ్ జీడి మొక్కలను ఏ కాలంనైనా పెంచుకోవచ్చు. అయితే జూన్ నుంచి డిసెంబర్ అనుకూలంగా ఉంటుందని రైతులు చెబుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి