
HDFC Bank Services: వినియోగదారులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలక అలర్ట్ జారీ చేసింది. నెట్ బ్యాంకింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు అందుకు తగినట్లుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకు సూచించింది. దీనికి సంబంధించిన మెసేజ్‌ను కస్టమర్లకు చేరవేసినట్లు తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన నెట్ బ్యాంకింగ్ సర్వీసులను మరింత మెరుగు పరిచేందుకు సిస్టమ్ మెయింటెనెన్స్ చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే సర్వర్ అప్ డేట్ చేస్తున్నట్లు వివరించింది. ఈ నెల 23, 2025న అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అవసరమైన సిస్టమ్ అప్‌గ్రేడ్‌లో భాగంగా ఈ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంకు తెలిపింది.
ఇది కూడా చదవండి: Sankranti Holidays 2026: ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా?
నవంబర్ 23న ఆ నాలుగు గంటల పాటు లావాదేవీలు నిర్వహించాలనుకునే HDFC బ్యాంక్ వినియోగదారులు బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, PayZapp, MyCards, WhatsApp ద్వారా చాట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవచ్చని సూచించింది. తమ సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వినియోగదారులు తమ సాకారాన్ని అందించాల్సిందిగా కోరింది.
ఇది కూడా చదవండి: Money Plant: ఈ సీజన్‌లో మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఇలా చేస్తే పచ్చగా..
ఇది కూడా చదవండి: Auto News: ఫుల్ ట్యాంక్ చేస్తే 780 కి.మీ రేంజ్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న బైక్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి