HDFC FD: చేతిలో డబ్బులున్నవారు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేందుకు ముందుకొస్తుంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, ఇతర రంగాలకు చెందిన వారు ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. ఇలాంటి డిపాజిట్లపై బ్యాంకులు మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎఫ్‌లపై కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా నిర్ణయించిన వడ్డీ రేట్లు జనవరి 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. రూ.2 లక్షల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీరేట్ల పెంపు 5 నుంచి 10 బేసిక్ పాయిట్ల వకు ఉంది.
7 రోజుల నుంచి 29 రోజుల ఎఫ్‌డీలపై 2.5 శాతం వడ్డీరేటు.
30 రోజుల నుంచి 90 రోజుల వరకు 3 శాతం వడ్డీ రేటు.
91 రోజుల నుంచి 6 నెలల వరకకు ఎఫ్‌డీలపై 3.5 శాతం
6 నెలల ఒక రోజు నుంచి ఏడాది లోపు వడ్డీ రేటు 4.9 శాతం
ఏడాది 1 రోజు నుంచి ఐదు సంవత్సరాల్లోపు వరకు 5 శాతం,5.2 శాతం,5.4 శాతం అలాగే 5.6 శాతం వడ్డీ రేట్లు లభిస్తున్నాయి.
ఇక సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీరేటు అధికంగా లభిస్తుంది. సాధారణ కస్టమర్లతో పోలిస్తే వీరికి 0.5 శాతం ఎక్కువగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి: