HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ స్కీమ్‌ గడువు పొడిగింపు

|

Mar 30, 2022 | 1:23 PM

HDFC Bank: బ్యాంకింగ్‌ రంగాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్..

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఆ స్కీమ్‌ గడువు పొడిగింపు
Follow us on

HDFC Bank: బ్యాంకింగ్‌ రంగాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తాజాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ (FD Scheme) గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాంకు సీనియర్‌ సిటిజన్ల (Senior citizens)కోసం సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ స్కీమ్‌ గడువు మార్చి 31 వరకు ఉండేది. ఈ స్కీమ్‌ సెప్టెంబర్‌ 30 వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరాలని భావిస్తే మార్చి తర్వాత కూడా చేరవచ్చని వెల్లడించింది.

ఈ స్కీమ్‌లో సీనియర్‌ సిటిజన్స్‌ చేరడం వల్ల 0.25 శాతం అధిక వడ్డీ రేటును పొందవచ్చు.5 కోట్లలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అలాగే 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్‌లో చేరడం వల్ల 0.75 శాతం అధిక వడ్డీ రేటును పొందవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 6.35 శాతంగా ఉంది. బ్యాంకు కస్టమర్లు మరి కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. బ్యాంకులో రూ. 5 లక్షల డిపాజిట్లకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక వేళ బ్యాంకు దివాలా తీసినట్లయితే కస్టమర్లకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకే చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి:

Cooking Oil Price: వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న వంట నూనె ధరలు.. ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు!

1 April New Rules: కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు..!