HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. 4న ఆ సేవలకు అంతరాయం.. ఏ సమయాల్లో అంటే..

|

Aug 03, 2024 | 6:24 PM

దేశంలోని బ్యాంకులు వినియోగదారుల కోసం మెరుగైన సేవలు అందిస్తున్నాయి. దేశంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కస్టమర్ల కోసం మెరుగైన సేవలు అందించేందుకు అనునిత్యం చర్యలు చేపడుతూనే ఉంటుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతర సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆగస్టు 4వ తేదీన 12.01 గంటల నుంచి తెల్లవారు జామున 3..

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. 4న ఆ సేవలకు అంతరాయం.. ఏ సమయాల్లో అంటే..
Hdfc
Follow us on

దేశంలోని బ్యాంకులు వినియోగదారుల కోసం మెరుగైన సేవలు అందిస్తున్నాయి. దేశంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కస్టమర్ల కోసం మెరుగైన సేవలు అందించేందుకు అనునిత్యం చర్యలు చేపడుతూనే ఉంటుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతర సేవలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆగస్టు 4వ తేదీన 12.01 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు (12.01 AM IST to 03.00 AM IST (3 hours) సేవలు అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ అంతరాయం ఏర్పడుతున్నందుకు వినియోగదారులు సహకరించాలని తెలిపింది.

Hdfc

అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారుల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రాబోయే సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ అప్‌గ్రేడ్ పనితీరు వేగాన్ని మెరుగుపరుస్తుంది. అధిక ట్రాఫిక్‌ను నిర్వహించడానికి సాయం చేస్తుందని పేర్కొంది. ఖాతాదారులకు సైతం సందేశం పంపినట్లు తెలిపింది.