
ప్రస్తుతం బ్యాంకింగ్ సేవలు చాలా సులభం అయిపోయాయి. బ్యాంక్‌కు వెళ్లాల్సిన అసవరం లేకుండానే అనేక సర్వీస్‌లు మన ఫోన్‌లోనే పూర్తి అయిపోతున్నాయి. డిజిటల్ విప్లవంలో భాగంగా అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు డిజిటల్ సేవలు అందిస్తున్నాయి. దాదాపు ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్ డిజిటల్ సేవలకు అలవాటు పడిపోయారు. ఒక్క గంట సేపు ఆ సేవలు నిలిచిపోయినా కూడా కంగారు పడిపోతారు. అందుకే బ్యాంకులు తమ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్త తీసుకుంటాయి. ఏదైనా సిస్టమ్ అప్డేట్స్ ఉంటే ముందుగానే కస్టమర్లకు తెలియజేస్తున్నాయి.
తాజాగా ప్రముఖ ప్రైవేటు బ్యాంకు హెడ్‌డీఎఫ్‌సీ కూడా తన ఎసెన్షియల్ సిస్టమ్ మెంయిటెనెన్స్‌లో భాగంగా తమ అన్ని రకాల సేవల్లో అంతరాయం ఏర్పడనుందని ముందుగానే తెలియజేసింది. శనివారం (24 జనవరి 2026) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్య సేవలు నిలిచిపోతాయని, అలాగే ఆదివారం (25 జనవరి 2026) కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి 4 గంటల మధ్య ఈ మెయింటెనెన్స్ కారణంగా అన్ని రకాల సర్వీస్‌లు హెడ్‌డీఎఫ్‌సీ నెట్ బ్యాంకింగ్, పే జ్యాప్, మై కార్డ్స్, వాట్సాప్ చాట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయని హెచ్‌డీఎఫ్‌సీ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి