HDFC Bank: ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ.. నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం..

|

May 06, 2021 | 10:55 PM

HDFC Bank Customer Alert: మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉందా.? అయితే ఈ వార్త మీ కోస‌మే. తాజాగా బ్యాంకు త‌మ ఖాతాదారులను ప‌లు సేవ‌ల విష‌యంలో అల‌ర్ట్ చేసింది. షెడ్యూల్ మెయిన్‌టెన్స్ యాక్టివిటీలో భాగంగా..

HDFC Bank: ఖాతాదారుల‌ను అల‌ర్ట్ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ.. నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం..
Hdfc Bank
Follow us on

HDFC Bank Customer Alert: మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా ఉందా.? అయితే ఈ వార్త మీ కోస‌మే. తాజాగా బ్యాంకు త‌మ ఖాతాదారులను ప‌లు సేవ‌ల విష‌యంలో అల‌ర్ట్ చేసింది. షెడ్యూల్ మెయిన్‌టెన్స్ యాక్టివిటీలో భాగంగా ప‌లు సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు ఖాతాదారుల‌కు స‌మాచారం అందించింది.
వివ‌రాల్లోకి వెళితే.. హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్‌, నెట్ బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు ఖాతాదారుల‌కు స‌మాచారం అందించింది. షెడ్యూల్డ్ మెయిన్‌టెన్స్ యాక్టివిటీలో భాగంగా మే8వ తేదిన ఉద‌యం 2 గంట‌ల నుంచి 5 గంట‌ల వ‌ర‌కు నెట్ బ్యాంకింగ్‌, మోబైల్ బ్యాంకింగ్ సేవ‌ల్లో అంత‌రాయం క‌ల‌గ‌నున్న‌ట్లు తెలిపింది. సేవ‌ల్లో అంత‌రాయానికి చింతిస్తున్న‌ట్లు బ్యాంక్ పేర్కొంది. ఖాతాదారులు దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల‌ని సూచించింది.
ఇదిలా ఉంటే నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ ఉప‌యోగిస్తున్న త‌మ ఖాతాదారుల‌కు హెచ్‌డీఎఫ్‌సీ ప‌లు కీల‌క సూచ‌న‌లు చేసింది. చేయాల్సిన‌, చేయ‌కూడ‌ని కొన్నిప‌నుల‌ను వివ‌రిస్తూ యూజ‌ర్ల‌ను అల‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. అవేంటంటే..

చేయాల్సిన‌ ప‌నులు..

* కంప్యూట‌ర్‌, మొబైల్ ఫోన్ల‌లో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* మీ పాస్‌వ‌ర్డ్‌ను స్ట్రాంగ్‌గా సెట్ చేసుకోవాలి. అలాగే ఎప్ప‌టిక‌ప్పుడు మారుస్తూ ఉండాలి.
* నెట్ బ్యాంకింగ్‌లో మీ ప‌ని పూర్తికాగానే క‌చ్చితంగా లాగవుట్ చెయ్యాలి.

చేయ‌కూడ‌ని ప‌నులు..

* మెసేజ్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా ఎవ‌రైనా మీ ఖాతా స‌మాచారాన్ని (క‌స్ట‌మ‌ర్ ఐడీ, క్రెడిట్‌/డెబిట్ కార్డు, పిన్‌, సీవీవీ) చెప్ప‌కూడ‌దు.

* ఇంట‌ర్నెట్ కేఫ్ సెంట‌ర్ల నుంచి ఎట్టి ప‌రిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను ఉప‌యోగించ‌కూడ‌దు.

* రిమంబ‌ర్ యూవ‌ర్ పాస్‌వ‌ర్డ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో టిక్ చేయ‌కూడ‌దు.

Also Read: ధోని మైదానంలోనే కాదు బయట కూడా కెప్టెనే..! ఈ విషయం తెలుసుకుంటే మీరు కూడా అలాగే అంటారు..

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. సంవత్సరంలో వారి ఆదాయం రెట్టింపు.. వారికి అదిరిపోయే బెనిఫిట్..

టీమిండియా క్రికెటర్ ఇంట్లో వరుస విషాదాలు.. కరోనాతో మొన్న అమ్మ.. నేడు అక్క.. ఎమోషనల్ ట్వీట్..