PAN Card: మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..? 10 నిమిషాల్లో ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి.

|

Oct 01, 2023 | 8:14 PM

కేవలం వీటికే పరిమితం కాకుండా క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవడం మొదలు, డీ మ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌, ఎల్‌ఐసీ ప్రీమియం, షేర్‌ మార్కెట్‌ ఇలా ప్రతీ దానికి పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. నిత్యజీవితంలో పాన్‌ కార్డ్‌ ఇప్పుడు ఓ భాగమైపోయింది. పాన్‌ కార్డ్‌ భారతదేశ ఆదాయపు శాఖ జారీ చేస్తుంది. పాన్‌ కార్డ్‌ను జాతీయ గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకుంటారు. 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌తో ఈ పాన్‌ కార్డ్‌ను...

PAN Card: మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..? 10 నిమిషాల్లో ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి.
E Pan Card
Follow us on

పాన్‌ కార్డ్‌.. ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే తెలిసినా ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ పాన్‌ కార్డ్‌పై అవగాహన పెరిగింది. ఆర్థికపరమైన లావాదేవీలన్నింటికీ పాన్‌ కార్డ్‌ తప్పనిసరికావడంతో ప్రతీ ఒక్కరికీ పాన్‌ కార్డ్‌ గురించి అందరికి తెలిసింది. టూవీలర్‌ నుంచి అన్ని రకాల వాహనాలు కొనుగోలు చేయాలంటే పాన్‌ కార్డ్‌ కావాల్సిందే. ఇక బ్యాంక్‌ అకౌంట్‌లో రూ. 50 వేలకు మించి జమ చేయాలంటే కూడా పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే.

కేవలం వీటికే పరిమితం కాకుండా క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవడం మొదలు, డీ మ్యాట్‌ అకౌంట్‌ ఓపెన్‌, ఎల్‌ఐసీ ప్రీమియం, షేర్‌ మార్కెట్‌ ఇలా ప్రతీ దానికి పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. నిత్యజీవితంలో పాన్‌ కార్డ్‌ ఇప్పుడు ఓ భాగమైపోయింది. పాన్‌ కార్డ్‌ భారతదేశ ఆదాయపు శాఖ జారీ చేస్తుంది. పాన్‌ కార్డ్‌ను జాతీయ గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకుంటారు. 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌తో ఈ పాన్‌ కార్డ్‌ను డిజైన్ చేస్తారు. అయితే పాన్‌ కార్డ్‌ను కోల్పోయినా, ఎక్కడైనా మర్చిపోయినా ఏం చేయాలో తెలుసా.? ఆన్‌లైన్‌లో సింపుల్‌గా కేవలం 10 నిమిషాల్లోనే ఇ-పాన్‌ కార్డ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

ఇ-పాన్‌ కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

* ఇ-పాన్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే మొదట ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో కనిపించే ఇన్‌స్టాంట్‌ ఈ-పాన్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత ఇ-పాన్‌ పేజీ ఓపెన్ చేసి గెట్‌ న్యూ ఇ-పాన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.

* అనంతరం ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తర్వాత చెక్‌బాక్స్‌ని సెలక్ట్ చేసుకొని, కంటిన్యూ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

* వెంటనే మీ ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. సదరు నెంబర్‌ను ఎంటర్‌ చేసి కంటిన్యూపై క్లిక్‌ చేయాలి.

* యూఐడీఏఐతో ఆధార్‌ వివరాలను కాన్ఫామ్‌ చేసుకోవడానికి చెక్‌బాక్స్‌ని సెలక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్‌ చేయాలి.

* ఆధార్‌ వివరాల వెరిఫికేషన్‌ పేజీలో ‘అగ్రీ’ చెక్‌బాక్స్‌ను ఎంచుకొని, కంటిన్యూపై నొక్కాలి.

* చివరిగా మీ మొబైల్‌ ఫోన్‌కు సక్సెస్‌ అయినట్లు మెసేజ్‌ వస్తుంది. దానిని ఐడీగా గుర్తుంచుకోవాలి.

* ఇక చివరిగా మీ యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్‌ అవ్వాలి. తర్వాత డ్యాష్‌బోర్డ్‌లో సర్వీస్‌ ఇ-పాన్‌ వ్యూ లేదా డౌన్‌లోడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత 12 అంకెల ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్ చేసి క్లిక్‌ చేయడం. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీటీపి వస్తుంది. దానిని సదరు బాక్స్‌లో ఎంటర్‌ చేస్తే వెంటనే మీ ఇ-పాన్‌ కార్డ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..