Sukanya Samriddhi Yojana: ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. భవిష్యత్ అవసరాలకు బోలెడంత భరోసా

|

Jul 04, 2024 | 4:15 PM

భారతదేశంలో పెట్టుబడిదారులకు కొన్ని ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలు రాబడిపై మంచి భరోసానిస్తున్నాయి. రిస్క్ తక్కువ ఉండడంతో ఆయా పథకాల్లో పెట్టుబడికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. ఇలాంటి పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) అనేది ప్రభుత్వ చిన్న డిపాజిట్ పొదుపు పథకం. ఈ పథకం బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడ పిల్లలల తల్లిదండ్రులు, సంరక్షకులు గానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

Sukanya Samriddhi Yojana: ఆ పథకంలో పెట్టుబడితో లాభాల పంట.. భవిష్యత్ అవసరాలకు బోలెడంత భరోసా
Sukanya Samriddhi Yojana
Follow us on

భారతదేశంలో పెట్టుబడిదారులకు కొన్ని ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలు రాబడిపై మంచి భరోసానిస్తున్నాయి. రిస్క్ తక్కువ ఉండడంతో ఆయా పథకాల్లో పెట్టుబడికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారు. ఇలాంటి పథకాల్లో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) అనేది ప్రభుత్వ చిన్న డిపాజిట్ పొదుపు పథకం. ఈ పథకం బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఆడ పిల్లలల తల్లిదండ్రులు, సంరక్షకులు గానీ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ ఖాతా బాలిక పేరు మీద తెరవాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖాతాల కింద నిర్వహణకు ఈ పథకంలో అవకాశం ఉండదు. ఈ పథకం కింద ఒక ఇంటిలో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలకు ఖాతా తెరవవచ్చు. ఈ నేపథ్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

వడ్డీ రేటు

సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన వడ్డీ రేటు మునుపటి త్రైమాసికం నుంచి స్థిరంగా ఉంది. జూలై-సెప్టెంబర్ 2024 త్రైమాసికానికి వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. 

గరిష్ట పెట్టుబడి

ఈ పథకంతో కనీస పెట్టుబడి రూ. 250గా ఉంది. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి.

ఇవి కూడా చదవండి

మెచ్యూరిటీ

పెట్టుబడికి మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలుగా ఉంటుంది. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చినా లేదా 21 ఏళ్లు వచ్చిన ఏది ముందుగా వచ్చినా పాలసీ మెచ్యూర్ అవుతుంది.

పన్ను ప్రయోజనాలు

ఎస్ఎస్‌వై పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్‌లపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. 

ఏడాదికి రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెడితే 

మీరు ఎస్ఎస్‌వై ప్లాన్‌లో నెలకు రూ. 5,000 పెట్టుబడి పెడితే, మీ మొత్తం వార్షిక పెట్టుబడి రూ. 60,000 అవుతుంది. ఈ పథకం సంవత్సరానికి 8.2 శాతం చక్రవడ్డీని చెల్లిస్తుంది కాబట్టి మీ 15 ఏళ్ల పెట్టుబడి రూ. 9 లక్షలుగా ఉంటుంది. వడ్డీ రూ. 18.92 లక్షలు, అంటే మెచ్యూరిటీ మొత్తం రూ. 27.92 లక్షలు మీ చేతికి వస్తుంది.  మీరు ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష లేదా నెలకు రూ. 8,333.33 పెట్టుబడి పెడితే మీ పెట్టుబడి 15 సంవత్సరాలలో రూ. 15 లక్షలు అవుతుంది. వడ్డీ రూ. 31.53 లక్షలు మరియు మెచ్యూరిటీలో రూ. 46.53 లక్షలుగా ఉంటుంది. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట పరిమితిలో అంటే రూ. 1.50 లక్షలు (లేదా నెలకు రూ. 12333.33) కింద పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో మీ పెట్టుబడి రూ. 22.50 లక్షలు అవుతుంది. వచ్చే వడ్డీ రూ. 47.30 లక్షలు, మెచ్యూరిటీ మొత్తం 69.80 లక్షలుగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..