LPG Cylinder Price: దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గనున్నాయా..? లోక్‌సభలో మంత్రి కీలక వ్యాఖ్యలు

|

Feb 10, 2023 | 7:31 AM

దేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు మండిపోతున్నాయి. ప్రతి నెల గ్యాస్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గృహ అవసరాల కోసం వాడే సిలిండర్‌ ధర నుంచి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ వరకు ధరలు పెరిగిపోయాయి..

LPG Cylinder Price: దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గనున్నాయా..? లోక్‌సభలో మంత్రి కీలక వ్యాఖ్యలు
Follow us on

దేశంలో ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు మండిపోతున్నాయి. ప్రతి నెల గ్యాస్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గృహ అవసరాల కోసం వాడే సిలిండర్‌ ధర నుంచి వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ వరకు ధరలు పెరిగిపోయాయి. అయితే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గుతాయోమోనన్న ఆశతో ఉన్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరల తగ్గింపు ప్రశ్నపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ గురువారం లోక్‌సభలో ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్‌ ధరలు తగ్గితే.. ప్రభుత్వం త్వరలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను తగ్గిస్తామని చెప్పుకొచ్చారు. ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గించడాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక మెట్రిక్ టన్ను గ్యాస్‌ను 750 డాలర్లకు విక్రయిస్తున్నారని అన్నారు.

గ్యాస్ సిలిండర్ ధరలకు ప్రపంచ పరిస్థితులే కారణం

దేశంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరపై డీఎంకే ఎంపీ డాక్టర్ వీరాస్వామి కళానిధి ఓ ప్రశ్నను సంధించారు. భారత్‌లో గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గుతాయని ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా, హర్దీప్ సింగ్ పూరీ సమాధానమిస్తూ అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధర అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు రానున్న రోజుల్లో దేశంలో గ్యాస్ కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇది గ్యాస్ ధరను తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు.

ప్రజల డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది

దీనితో పాటు దేశంలోని పేద ప్రజల డిమాండ్ల పట్ల ప్రభుత్వం ‘సున్నితంగా’ ఉందని అన్నారు. సౌదీ అరేబియాలో గ్యాస్ ధరలలో 330 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. అయితే ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను చాలా తక్కువగా పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియాలో గ్యాస్ ధరలు తగ్గితే.. దాని ప్రభావం దేశంలో అందుబాటులో ఉన్న ఎల్‌పీజీ సిలిండర్‌లపై కూడా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సామాన్యులకు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్లను అందజేస్తుంది.

ఇవి కూడా చదవండి

2022లో ప్రభుత్వ చమురు కంపెనీలు దేశీయ వంట గ్యాస్ ధరలను సిలిండర్‌కు దాదాపు రూ.150 పెంచాయి. ఏది ఏమైనా వంటగ్యాస్ ఖరీదు విషయంలో మోడీ సర్కార్ పై ప్రతిపక్షాలు సర్వత్రా దాడి చేస్తున్నాయి. ప్రతిపక్షం ఖరీదైన వంటగ్యాస్ గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. 2014లో గృహోపకరణాల వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.414కి ఎలా లభించిందో గుర్తుచేస్తోంది. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023న నుంచి రూ.500కే సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి