Iran And Israel War: ఇరాన్ దెబ్బకు గల్ప్ దేశాలు అతలాకుతలం.. సంచలన నిర్ణయం దిశగా అడుగులు..! ఇదే జరిగితే అమెరికా డీలా..

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం గల్ప్ దేశాలపై ఎక్కువగా పడుతోంది. గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ నిర్విరామంగా దాడులు చేపడుతోంది. ఈ క్రమంలో గల్ప్ దేశాలకు తీవ్రంగా నష్టం జరుగుతోంది. ఆయిల్ ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. ఈ క్రమంలో సంచలనం దిశగా అడుగులు వేస్తున్నాయి.

Iran And Israel War: ఇరాన్ దెబ్బకు గల్ప్ దేశాలు అతలాకుతలం.. సంచలన నిర్ణయం దిశగా అడుగులు..! ఇదే జరిగితే అమెరికా డీలా..
Trump

Updated on: Mar 08, 2026 | 12:13 PM

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్దం రోజురోజుకి తీవ్రతరం అవుతోంది. అమెరికా కూడా ఈ యుద్దంలో పాల్గొని ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడుతుండగా.. పశ్చిమాసియా దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విజృంభిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనగా.. అంతర్జాతీయంగా అన్ని దేశాలపై దీని ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు మరికొన్ని గల్ప్ దేశాలు సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతున్నాయి. అమెరికాతో తమ పెట్టుబడి, కాంట్రాక్టులు, ఒప్పందాలను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం వల్ల తమ దేశాల ఆర్దిక వ్యవస్థలకు నష్టం జరుగుతుందనే కారణంతో అమెరికాతో చేసుకున్న కాంట్రాక్టులను ఉసంహరించుకునేందుకు సిద్దమవుతున్నాయి.

తగ్గిన ఇంధన ఆదాయం

ఇప్పటికే ఉన్న ఒప్పందాల్లో ఫోర్స్ మేజ్యూర్ నిబంధనలను అమలు చేసే అంశంపై అంతర్గతంగా గల్ప్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ప్రస్తుత పెట్టుబడులతో పాటు భవిష్యత్ పెట్టుబడులపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే విదేశీ ప్రభుత్వాలు, కంపెనీలతో పెట్టుబడులు, క్రీడా స్పాన్సర్‌షిప్ డీల్స్, హోల్డింగ్స్ అమ్మకం వంటి వాటిపై ప్రభావితం పడనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యుద్దం వల్ల గల్ప్ దేశాల ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. యుద్దం వల్ల ఆయిల్ ఎగుమతులకు అంతరాయం కలగడంతో వాటి నుంచి వచ్చే ఆదాయం భారీ స్థాయిలో తగ్గుతోంది. ప్రపంచంలో చమురు, గ్యాస్ సరఫరాలో ఐదో వంతు హార్ముజ్ జలసంధి ద్వారా జరుగుతోంది. అయితే ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో అనేక ట్యాంకర్లు ఢీకొనడం, ఈ మార్గంలో సరుకు రవాణాకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల ఇంధన ఆదాయాలు తగ్గడంతో గల్ప్ దేశాలు నష్టపోతున్నాయి.

ఆర్ధిక వ్యవస్థపై ఒత్తిడి

ఇక గల్ప్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు, స్థావరాలపై ఇరాన్ దాడులను కొనసాగిస్తోంది. దీని వల్ల విమానాలు రద్దు కావడం, టూరిస్టుల రాక తగ్గిపోవడంతో ఆదాయం తగ్గుతుంది. దీని వల్ల గల్ప్ దేశాల ప్రభుత్వ బడ్జెట్‌లపై ఒత్తిడి పడుతోంది. దీంతో విదేశీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని సమాలోచన చేస్తున్నాయి. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ప్ దేశాలను సందర్శించారు. అనంతరం అమెరికాలో బిలయన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు గల్ప్ దేశాలు ముందుకొచ్చాయి. యుద్దం వల్ల పెట్టుబడులపై అనిశ్చితి నెలకొంది. దీంతో దౌత్యపరమైన పరిష్కారం కోసం అమెరికాతో గల్ప్ దేశాలు చర్చలు జరిపేందుకు సిద్దమవుతున్నాయి.

Follow Us