GST Tax Payers: పన్ను చెల్లింపుదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టుకు సంబంధించి జీఎస్‌టీ నుంచి డిడక్ట్ ట్యాక్స్ అటో సోర్స్ (టీడీఎస్) మినహాయింపు పొందాలని అనుకునే వారికి సెప్టెంబర్ 10వ తేదీలోగా జీఎస్‌టీఆర్-7 ఫామ్‌ను దాఖలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. టీడీఎస్ మినహాయింపుకు మరో రెండు రోజులు సమయమే ఉందని తెలిపింది. నిర్దేశిత గడువులోగా జీఎస్‌టీ ఫామ్ 7ను దాఖలు చేయాలని, లేదంటే ఆలస్య రుసుముతో పాటు వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది.
ఒకవేళ ఎవరైనా పన్ను చెల్లింపుదారులు ఉంటే టీడీఎస్‌ని జీఎస్టీ కింద పన్ను తీసివేయాల్సి వస్తే అటువంటి పన్ను చెల్లింపుదారులు ఆగస్టు నెలకు సంబంధించిన జీఎస్టీఆర్-7 రిటర్న్ ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.
Attention GST Taxpayers who are required to deduct Tax at Source (TDS) under GST!
File your GSTR-7 Return for the month of August, 2021 by September 10th, 2021. pic.twitter.com/6XmfZuRkDq
— CBIC (@cbic_india) September 8, 2021