GST Collection: జూలై 2022లో జీఎస్టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు.. గత నెల కంటే అధికమే..!

|

Aug 01, 2022 | 2:48 PM

GST Collection: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో తీసుకున్న నిర్ణయాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నకిలీ బిల్లుల తయారీ, జీఎస్టీ ఎగవేత పెరుగుతున్న..

GST Collection: జూలై 2022లో జీఎస్టీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు.. గత నెల కంటే అధికమే..!
Gst
Follow us on

GST Collection: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో తీసుకున్న నిర్ణయాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. నకిలీ బిల్లుల తయారీ, జీఎస్టీ ఎగవేత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరిగింది. ఇక జూలై 2022లో GST వసూళ్లు రూ. 1,48,995 కోట్లుగా ఉన్నాయి. అయితే జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,44,616 కోట్లు. అంటే జూన్‌ కంటే జూలై నెలలో అత్యధికంగా వసూళ్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏప్రిల్ 2022లో GST వసూళ్లు రూ. 1,67,540 కోట్లు ఉంది. గత ఏడాది జూలై 2021తో పోలిస్తే 2022 జూలైలో GST వసూళ్లు 28 శాతం పెరిగాయి. గతేడాది జూలైలో జీఎస్టీ వసూళ్లు రూ.1,16,393 కోట్లుగా ఉంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. జూలై, 2022లో రూ.1,48,995 కోట్ల జీఎస్టీ వసూళ్లలో, సీజీఎస్టీ రూ.25,751 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.32,807 కోట్లు ఉండగా, రూ.41,420 కోట్లు వస్తువుల దిగుమతుల ద్వారా, రూ.79,618 కోట్ల ఐజీఎస్టీ వసూళ్లు వచ్చాయి. అలాగే సెస్‌ వసూళ్ల వాటా రూ. 10,920 కోట్లు. 1 జూలై 2017న GST అమలులోకి వచ్చిన తర్వాత GST వసూళ్లలో ఇది రెండవ అత్యధిక సంఖ్య. ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

 


GST ఆదాయం గత సంవత్సరం జూలై 2021 కంటే 35 శాతం ఎక్కువ. అలాగే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న చర్యల కారణంగా మెరుగైన లాభాలు వస్తున్నాయి. మెరుగైన రిపోర్టింగ్‌తో పాటు, జీఎస్‌టి సేకరణపై ఆర్థిక పునరుద్ధరణ సానుకూల ప్రభావం చూపుతోంది. జీఎస్టీ ఎగవేతలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు, ముఖ్యంగా నకిలీ బిల్లుల తయారీదారులపై చర్యలు తీసుకోవడం వల్ల జీఎస్టీ వసూళ్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి