GST Revenue Collected: డిసెంబర్ 2022లో రూ. 1.4 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. ప్రభుత్వానికి భారీ ఆదాయం

|

Jan 02, 2023 | 7:05 AM

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో మంచి ఆదాయాన్ని సంపాదించింది. డిసెంబర్‌ 2022కి సంబంధించి జీఎస్టీ డేటా బయటకువచ్చింది. ఇందులో 1.4 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ జీఎస్టీ రాబడిని సాధించింది. గతేడాది..

GST Revenue Collected: డిసెంబర్ 2022లో రూ. 1.4 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు.. ప్రభుత్వానికి భారీ ఆదాయం
Gst Revenue Collected
Follow us on

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విషయంలో మంచి ఆదాయాన్ని సంపాదించింది. డిసెంబర్‌ 2022కి సంబంధించి జీఎస్టీ డేటా బయటకువచ్చింది. ఇందులో 1.4 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ జీఎస్టీ రాబడిని సాధించింది. గతేడాది డిసెంబర్‌లో రూ.1,49,507 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ రకంగా చూస్తే జీఎస్టీ వసూళ్లతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. డిసెంబర్ 2022లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1,49,507 కోట్లు కాగా, ఇందులో CGST వాటా రూ. 26,711 కోట్లు. ఎస్‌జీఎస్‌టీ వాటా రూ.33,357 కోట్లు కాగా, ఐజీఎస్టీ వసూళ్లు రూ.78,434 కోట్లుగా ఉన్నాయి. ఈ ఐజీఎస్టీలో వస్తువుల దిగుమతి నుండి మొత్తం రూ. 40,263 కోట్లు ఉండగా, ఇది కాకుండా సెస్ వాటా రూ.11,005 కోట్లు కాగా ఇందులో రూ.850 కోట్లు వస్తువుల దిగుమతి ద్వారా అందింది.

సాధారణ సెటిల్‌మెంట్‌గా రూ.36,669 కోట్ల సీజీఎస్‌టీ వాటాను, రూ.31,094 కోట్ల ఎస్‌జీఎస్‌టీని ప్రభుత్వం సెటిల్ చేసింది. డిసెంబర్ 2022లో, రాష్ట్రాలు, కేంద్రం సాధారణ సెటిల్‌మెంట్ తర్వాత సీజీఎస్టీ కింద రూ. 63,380 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ. 64,451 కోట్లు పొందాయి.

ఇవి కూడా చదవండి

 

వార్షిక ప్రాతిపదికన అద్భుతమైన ఆదాయ వృద్ధి:

డిసెంబర్ 2022లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంతకు ముందు ఏడాది అంటే డిసెంబర్ 2021 కంటే 15 శాతం ఎక్కువ వచ్చింది. డిసెంబర్ 2022లో వస్తువుల దిగుమతి నుండి వచ్చే ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8 శాతం ఎక్కువ, దేశీయ లావాదేవీలు (వీటిలో సేవల దిగుమతి కూడా) 18 శాతం ఎక్కువ. ఇక నవంబర్ 2022లో 7.9 కోట్ల ఇ-వే బిల్లులు ఉండగా, ఇది అక్టోబర్ 2022తో పోలిస్తే మంచి వృద్ధిని సాధించింది. అక్టోబర్ 2022లో 7.6 కోట్ల ఇ-వే బిల్లులు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి