GST Council Meet: జూన్‌ 28,29 తేదీల్లో జీఎస్టీ మండలి సమావేశం.. జీఎస్టీలో స్లాబ్‌లను తగ్గించే అవకాశం

|

Jun 17, 2022 | 8:33 AM

GST Council Meet: వస్తు సేవల పన్ను మండలి (GST council) సమావేశాలు ఈసారి రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitaraman) ..

GST Council Meet: జూన్‌ 28,29 తేదీల్లో జీఎస్టీ మండలి సమావేశం.. జీఎస్టీలో స్లాబ్‌లను తగ్గించే అవకాశం
Follow us on

GST Council Meet: వస్తు సేవల పన్ను మండలి (GST council) సమావేశాలు ఈసారి రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitaraman) అధ్యక్షతన ఈ నెల 28, 29 తేదీల్లో ఈ సమావేశాలు జరుగనున్నాయని ఆర్థిక శాఖ కార్యాలయం తెలిపింది. శ్రీనగర్‌ వేదికగా జరిగే 47వ జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశాలున్నాయి. వస్తు, సేవల పన్ను (GST)పై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై రాష్ట్రాల మంత్రులు ప్యానెల్‌ సమర్పించే నివేదికతో పాటు క్యాసినోలు, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్స్‌పై జీఎస్టీ రేటు నిర్ణయించే అంశంపైనా చర్చించే అవకాశాలు ఉండటంతో ఈ సారి సమావేశంలో అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పన్ను రేట్లలో ఏవైనా మార్పు చేర్పులకు అవకాశం ఉందా అనే అంశంపై శుక్రవారం (నేడు) మంత్రుల బృందం సమావేశం అయ్యే అవకాశం ఉంది.

 

ఇవి కూడా చదవండి


జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణపై మంత్రుల బృందం సమర్పించే తాత్కాలిక నివేదికతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ మండలి జూన్‌ 28,29న రెండు రోజుల పాటు భేటీ కానుంది. దీంతో జీఎస్టీ రేట్లలో ప్రస్తుతానికి మార్పులు చేసే అవకాశాలున్నట్లు పలువురు భావిస్తున్నారు. GST విధానంలో వస్తువులు, సేవలపై 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం నాలుగు పన్ను స్లాబ్‌లలో పన్ను విధిస్తున్నారు. ఈ పన్ను శ్లాబులను 4 నుంచి 3కి తగ్గించే ఆలోచనలో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి