ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా మూలధనం కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా మార్కెట్లపై ఆధారపడాలన్నారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ముంబయిలోని ట్రైడెంట్ హోటల్‌లో ఎఫ్‌ఐబీఏసీ-2019 ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థ మందగించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిందని తెలిపారు. సమస్యలను అధిగమించడానికి బ్యాంకులు కృషి చేయాలన్నారు. దివాలా పరిష్కార చట్టం సవరించడం బ్యాంకులకు ఉపయోగపడుతుందన్నారు. బ్యాంకులు రెపోరేటుతో రుణాలు, డిపాజిట్లను అనుసంధానించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అమల్లోకి తెచ్చిన అన్ని నిబంధనలు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కూడా వర్తిస్తాయని తెలిపారు. ఆర్‌బీఐ కొన్ని నిబంధనలను పునరుద్ధరించనుందని ఆయన తెలిపారు.