మనం గానీ, మనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఏదైనా సందర్భంలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఉంటాం. కాలం గడిచే కొద్దీ ఆ డిపాజిట్ల వివరాలను మర్చిపోతూ ఉంటాం. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనం డిపాజిట్ చేసిన సొమ్ముకు సంబంధించిన పత్రాలను పొగొట్టుకుంటాం. ఇలాంటి డిపాజిట్లు కోట్లాది రూపాయలు బ్యాంకుల వద్ద మూలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లను డిపాజిట్‌దారులకు లేదా వారి వారసులకు అందించడానికి సరికొత్త పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఆర్‌బీఐ యూడీజీఏఎం పేరుతో లాంచ్ చేసిన పోర్టల్‌ను ఆగస్టు 17న ప్రారంభించింది. అయితే మొదట్లో కొన్ని బ్యాంకుల మాత్రమే ఆర్‌బీఐ యూడీజీఏఎం పోర్టల్‌లో నమోదుకు ముందుకు వచ్చాయి.
యూడీజీఏఎం పోర్టల్ వస్తున్న ఆదరణ నేపథ్యంలో ఆర్‌బీఐ సూచన మేరకు చాలా బ్యాంకులు యూడీజీఏఎం పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి. ముఖ్యంగా డిపాజిట్లను తనిఖీ చేయడానికి బహుళ బ్యాంకులను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఒకేచోట తనిఖీ చేసే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా ఎక్కువ శాతం ఈ సర్వీసును ఉపయోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అక్టోబర్ 15 నాటికి దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లను యూడీజీఏఎం పోర్టల్ ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్‌బీఐ యూడీజీఎం పోర్టల్ ద్వారా ఏయే బ్యాంకుల అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లను తెలుసుకోవచ్చో? ఓసారి తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం