Gram Suraksha Scheme: పోస్టల్ శాఖలో ప్రస్తుతం ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు మంచి రాబడి పొందే విధంగా వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించే వారికి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. అయితే మీకు ఒక అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. ఇండియా పోస్ట్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ల కోసం గ్రామ్ సురక్ష స్కీమ్ ఆఫర్ చేస్తోంది. ఇది హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ. ఈ పథకంలో చేరిన వారికి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అంటే మెచ్యూరిటీ సమయంలో బోనస్ లభిస్తుంది. ఒకవేళ స్కీమ్‌లో చేరిన వారు ముందే మరణించినట్లయితే.. నామినీ లేదా కుటుంబ సభ్యులకు డబ్బులు అందిస్తారు. 19 నుంచి 55 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
కనీసం రూ.10 వేల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.10 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం మొత్తాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించే వెసులుబాటు కూడా ఉంటుంది. ప్రీమియం చెల్లింపునకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. పాలసీ కొనుగోలు చేసిన 4 సంవత్సరాల తర్వాత లోన్ సదుపాయం కూడా పొందవచ్చు. 55 ఏళ్లు, 58 ఏళ్లు, 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకునే సదుపాయం ఉంటుంది. ఇండియా పోస్ట్ చివరిగా ఈ పాలసీ తీసుకున్న వారికి ఏడాదికి రూ.1000కు రూ.60 బోనస్ ప్రకటించింది.
19 ఏళ్ల వయసులో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే.. 55 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే.. రూ.31.6 లక్షలు, 58 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే రూ.33.4 లక్షలు, 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే రూ.34.6 లక్షల మెచ్యూరిటీ బెనిఫిట్ పొందవచ్చు. అదే నెలవారీ ప్రీమియం విషయానికి వస్తే.. 55 ఏళ్లకు రూ.1515, 58 ఏళ్లకు రూ.1463, 60 ఏళ్లకు రూ.1411 పడుతుంది. రోజుకు రూ.50 ఆదా చేస్తే సరిపోతుంది. ఇలా పోస్టల్ శాఖలో ఉన్న పలు రకాల స్కీమ్‌లలో చేరిలో మంచి లాభాలు పొందవచ్చు. డబ్బులను పొదుపు చేసుకుని అన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. మున్ముందు అవసరాలకు ఉపయోగపడతాయి.