Bharat Brand: కిలో గోధుమ పిండి రూ.30, బియ్యం 34కే.. మళ్లీ భారత్‌ బ్రాండ్‌ విక్రయాలు ప్రారంభించిన కేంద్రం!

రెండో విడతగా తక్కువ ధరల్లో విక్రయించేందుకు మంగళవారం ప్రారంభించింది. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భండార్‌, ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా ఈ విక్రయాలను కొనసాగించనుంది ప్రభుత్వం..

Bharat Brand: కిలో గోధుమ పిండి రూ.30, బియ్యం 34కే.. మళ్లీ భారత్‌ బ్రాండ్‌ విక్రయాలు ప్రారంభించిన కేంద్రం!

Updated on: Nov 05, 2024 | 4:31 PM

ప్రస్తుతం నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ సామాన్యులకు ఊరట కలించేందుకు చర్యలు చేపట్టింది. సబ్సిడీ కింద తక్కువ ధరల్లోనే భారత్‌ బ్రాండ్‌పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను తిరిగి ప్రారంభించింది. వీటిని గతంలో కూడా విక్రయించగా, తాజాగా మళ్లీ కొనసాగిస్తోంది. గతంలో మొదటి విడత ప్రారంభించగా, ఇప్పుడు రెండో విడతగా తక్కువ ధరల్లో విక్రయించేందుకు మంగళవారం ప్రారంభించింది. నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రీయ భండార్‌, ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా ఈ విక్రయాలను కొనసాగించనుంది ప్రభుత్వం. సామాన్యులకు ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రెండో విడతగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

సెకండ్‌ ఫేజ్‌లో..

ఈ రెండో విడతలో భాగంగా 3.69 లక్షల టన్నుల గోధుమలు, 2.91 లక్షల టన్నులు బియ్యాన్ని ఎఫ్‌సీఐ నుంచి సేకరించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ స్టాక్‌ పూర్తయ్యే వరకు విక్రయాలు కొనసాగుతాయని, అవసరమైతే మరిన్ని కేటాయింపులు ఉంటాయని తెలిపారు.

రూ.30కే కిలో గోధుమ పిండి:

ఇదిలా ఉండగా, ఈ రెండో విడతలో కేవలం రూ.30లకే కిలో గోధుమ పిండిని విక్రయించనున్నట్లు, ఈ పిండి ప్యాకెట్లు 5, 10 కిలోలు ఉంటాయని తెలిపారు. అలాగే కిలో బియ్యం రూ.34కే విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఈ బియ్యం బస్తా5,10 కిలోలు ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: Gold Rate Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us