
కాలుష్య స్థాయిలను తగ్గించడానికి, ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే సెంట్రల్ సర్కార్ ప్రతిష్టత్మకంగా చేపట్టిన PM e-డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల లక్ష్యాన్ని చేరుకుంది. ఈ పథకం లక్ష్యం దాదాపు 2.9 లక్షల L5 కేటగిరీ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు అమ్మకాలు సాధించబడింది. దీంతో PM e-డ్రైవ్ పథకం కింద విద్యుత్ త్రిచక్ర వాహనాలకు (e-3W) సబ్సిడీలను తొలగించింది. అవును,.. ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై త్రిచక్ర వాహనాల కొనుగోలుపై ప్రజలు ఎటువంటి సబ్సిడీ లభించదు.
2025డిసెంబర్ 30న ప్రభుత్వ ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల మార్కెట్ వాటా 32శాతానికి పెరిగింది. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను త్రీ-వీలర్ మార్కెట్‌లో 20-30శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం ఇప్పుడు సాధించినట్టుగా ఒక అధికారి పేర్కొన్నారు. పరిశ్రమ కూడా ఈ నిర్ణయంతో ఏకీభవిస్తోందని చెప్పారు.
L5 కేటగిరీ కోసం 2.88 లక్షల వాహనాల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని కూడా సాధించారు. 2025లో 7.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. వీటిలో 60శాతం EVలు ఉన్నాయి. ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలలో (e-2W) ప్రవేశం 7.5శాతం మాత్రమే. లక్ష్యం 25 లక్షల యూనిట్లు, కానీ ఇప్పటి వరకు 18.3 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని అంచనా.
అందువల్ల ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో కూడా కొనసాగే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త నిర్ణయం తీసుకోబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తోంది. అనేక రాష్ట్రాలు తమ సొంత పథకాలు, ప్రోత్సాహకాలను ప్రవేశపెడుతున్నాయి. వచ్చే నెలలో కొత్త ప్యాకేజీ ప్రకటించబడవచ్చునని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గింపులు, ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇకపోతే, నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చాలా తక్కువగా ఉందని, కాబట్టి అక్కడ కూడా రాష్ట్ర స్థాయి మద్దతు అవసరం అంటున్నారు.
PM e-డ్రైవ్ పథకం 14,000 ఎలక్ట్రిక్ బస్సులు, 5,643 ట్రక్కులకు మద్దతు ఇస్తుంది. అయితే, వాహనాలు ఇంకా టెస్ట్ ట్రయల్ దశలో ఉన్నందున వీటికి డిమాండ్ అంతగా లేదని అంటున్నారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అతిపెద్ద సవాలు అని, ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లు ముందుకు రావాలని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.