NPCI With Google: ఎన్‌పీసీఐతో గూగుల్‌ దోస్తీ.. ఇకపై విదేశాల్లోనూ యూపీఐ సేవలు

|

Jan 20, 2024 | 12:30 PM

తాజాగా గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ (పి) లిమిటెడ్, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపిఎల్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన  పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన యూపీఐ సర్వీసులను ఇతర దేశాలకు విస్తరించడానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. గూగుల్ ఇండియన్, ఎన్‌పిసిఐ మధ్య సంతకం చేసిన అవగాహనా ఒప్పందానికి మూడు కీలక లక్ష్యాలు ఉన్నాయి.

NPCI With Google: ఎన్‌పీసీఐతో గూగుల్‌ దోస్తీ.. ఇకపై విదేశాల్లోనూ యూపీఐ సేవలు
Npci With Google
Follow us on

భారతదేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ గణనీయంగా పెరిగాయి. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ ఈ స్థాయిలో పెరగడానికి ఎన్‌పీసీఐ లాంచ్‌ చేసిన యూపీఐ సర్వీసులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రత్యక్ష నగదు చలామణీని తగ్గించేందుకు తీసుకొచ్చిన ఈ సిస్టమ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. అయితే తాజాగా గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ (పి) లిమిటెడ్, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్‌ఐపిఎల్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన  పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన యూపీఐ సర్వీసులను ఇతర దేశాలకు విస్తరించడానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. గూగుల్ ఇండియన్, ఎన్‌పిసిఐ మధ్య సంతకం చేసిన అవగాహనా ఒప్పందానికి మూడు కీలక లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలతో పాటు ఎంఓయూ చేయడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూస్తాం.

గూగుల్‌, ఎన్‌పీసీఐ తాజాగా ఒప్పందం ముందుగా భారతదేశం వెలుపల ఉన్న ఖాతాదారులకు కోసం యూపీఐ చెల్లింపుల వినియోగాన్ని విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తుంది. విదేశాలలో సౌకర్యవంతంగా లావాదేవీలు చేయడానికి వీలు కల్పిస్తుంది.  ఇతర దేశాలలో యూపీఐవంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో సహాయం చేయడం, అతుకులు లేని ఆర్థిక లావాదేవీల కోసం ఒక నమూనాను అందించడం కోసం ఎంఓయూపై సంతకం చేశారు. అలాగే యూపీఐ మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా దేశాల మధ్య చెల్లింపుల ప్రక్రియను సులభతరం చేయడంపై దృష్టి పెడుతుంది. తద్వారా సరిహద్దు ఆర్థిక మార్పిడిని సులభతరం చేస్తుంది. 

యూపీఐకు సంబంధించిన ప్రపంచ ఆమోదాన్ని వేగవంతం చేయడంలో ఈ చర్యలు సహాయపడతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ వ్యాపారులు భారతీయ వినియోగదారులకు ప్రాప్యతను అందించడం, వారు ఇకపై డిజిటల్ చెల్లింపులు చేయడానికి విదేశీ కరెన్సీ లేదా, క్రెడిట్ లేదా ఫారెక్స్ కార్డ్‌లపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. యూపీఐ ఆధారిత యాప్‌లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. గ్లోబల్ డిజిటల్ పేమెంట్ ల్యాండ్‌స్కేప్‌లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఎన్‌పీసీఐ ప్రయత్నానికి అనుగుణంగా ఉంది. అంతేకాకుండా సాంప్రదాయక నగదు బదిలీ మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా రెమిటెన్స్‌లను సరళీకృతం చేయడంలో గణనీయమైన సహకారం అందించడం కూడా ఈ ఎంఓయూ లక్ష్యం. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి