Google-Airtel: ఇండియాలో ప్రముఖ టెలికం కంపెనీ (Telecom Company)లలో ఇన్వెస్ట్‌మెంట్ (Investment) పెట్టడం ప్రారంభించిన గూగుల్.. మరో భారీ ఒప్పందానికి రెడీ అయ్యింది. ఇక ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్ (Airtel)లో వచ్చే ఐదు సంవత్సరాలలో గూగుల్ (Google)రూ.7,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ‘భారత్‌లో డిజిలీకరణ నిధుల కోసం గూగుల్’ అనే కార్యక్రమం కింద ఈ నిధులు ఇన్వెస్ట్ చేయనుంది.
ఎయిర్‌టెల్ (Airtel)కు చెందిన ఒక్కోషేరును రూ.734తో కొనుగోలు చేసేందుకు గూగుల్ (Google) 700 మిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం పెట్టుబడులలో మరో 300 మిలియన్ డాలర్లు, ఎయిర్ టెల్ ద్వారా కస్టమర్లకు ఆధునిక మొబైల్ పరికరాలు, ఇతర ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ పెట్టుబడులను పెట్టనుంది. డిజిటల్ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గూగుల్ ఈ నిధులను వెచ్చించనన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇండియాలో డిజిటల్ వ్యవస్థను మరింత విస్తరించేందుకు గూగుల్‌తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ భారతి మిత్తల్ వెల్లడించారు. గూగుల్ ఇప్పటికే రిలయన్స్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడులు పెట్టింది.
ఇవి కూడా చదవండి: