UPI Services: వారికి ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు బంద్.. కీలక నిర్ణయం తీసుకున్న ఎన్‌పీసీఐ

|

Mar 22, 2025 | 3:45 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో నగదు చెల్లింపుల్లో యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్లు ఉంటున్న ప్రస్తుత రోజుల్లో దేశంలో యూపీఐ సేవలను ప్రవేశపెట్టడంతో ప్రజలు బాగా ఆకర్షితులయ్యారు. ఎక్కడికి వెళ్లినా క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. అయితే తాజాగా యూపీఐ మాతృసంస్థ అయిన ఎన్‌పీసీఐ కీలక నిర్ణయం చేసింది. మొబైల్ నంబర్ యాక్టివ్‌గా లేకపోతే యూపీఐ చెల్లింపులను నిలిపేస్తామని ప్రకటించింది.

UPI Services: వారికి ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు బంద్.. కీలక నిర్ణయం తీసుకున్న ఎన్‌పీసీఐ
Upi Services
Follow us on

2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన యూపీఐ సేవలు అనతి కాలంలో ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందన్న చందాన యూపీఐ ఉపయోగించుకుని మోసాలు చేసే వారికి సంఖ్య కూడా రోజురోజుకూ పెరగడంతో యూజర్ల భద్రత కోసం ఎన్‌పీసీఐ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసకుంటుంది. తాజాగా యూపీఐకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌లు ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా లేకుంటే వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి తొలగిస్తామని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నిర్ణయం యూపీఐ సేవలపై గణనీయంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఎన్‌పీసీఐ తాజా నిర్ణయంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా యూపీఐ ఉపయోగించే వారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 

సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లు బ్యాంకింగ్, యూపీఐ వ్యవస్థల్లో సాంకేతిక లోపాలను సృష్టించవచ్చని నిపుణులు చెబతున్నారు. ఒకవేళ టెలికం  ప్రొవైడర్లు ఈ నంబర్లను వేరొకరికి తిరిగి కేటాయిస్తే మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తన పౌరుల భద్రతను నిర్ధారించడంతో పాటు అలాంటి ప్రమాదాల నుంచి వారిని రక్షించడం ప్రాథమిక బాధ్యత అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌పీసీఐ పేర్కొంది. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలను సులభతరం చేయడానికి మీ బ్యాంక్ ఖాతాకు యాక్టివ్ మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం. చెల్లింపుల సమయంలో ఈ నంబర్ కీలకమైన ఐడెంటిఫైయర్‌గా పనిచేస్తుంది. కాబట్టి యూజర్లు ఎప్పుడూ యాక్టివ్ నంబర్లను యూపీఐకు లింక్ చేసుకోవాలని సూచించింది. 

మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా లేకుంటే లేదా కొంతకాలంగా రీఛార్జ్ చేయకపోతే ఆ నంబర్ ఇప్పటికీ మీ పేరుతో యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించుకోవడానికి మీ టెలికం ప్రొవైడర్ ద్వారా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ నెంబర్ ఇన్‌యాక్టివ్ స్టేటస్‌లో ఉంటే మీరు వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలి లేదా కొత్త మొబైల్ నంబర్‌తో మీ బ్యాంక్ ఖాతాను అప్‌డేట్ చేయాలి. ఇకపై ఎన్‌పీసీఐ ప్రతి వారం నిష్క్రియ మొబైల్ నంబర్ల రికార్డులను సవరించాలని బ్యాంకులు, యూపీఐ అప్లికేషన్‌ల ప్రొవైడర్లను ఆదేశించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..