Google: గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకి 9 రోజులు ఆఫీస్‌కి వచ్చే వారికి ఆ సర్వీస్ ఫ్రీ..

|

Apr 09, 2022 | 9:14 PM

Google: అమెరికా టెక్ దిగ్గజం ఆఫీస్ కు రావాలనుకుంటున్న ఉద్యోగులకు మంచి ఆఫర్ ప్రకటించింది. ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు కేవలం నెలకు 9 రోజులు ఆఫీసుకు వస్తే సరిపోతుందని వెళ్లడించింది. కరోనా తరువాత ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు సంస్థ వినూత్న ప్రయత్నంతో ముందుకు వచ్చింది.

Google: గూగుల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకి 9 రోజులు ఆఫీస్‌కి వచ్చే వారికి ఆ సర్వీస్ ఫ్రీ..
Follow us on

Google: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం గూగుల్ బే ఏరియాతో సహ ఇతర ప్రదేశాల్లో ఉన్న ఉద్యోగులను తిరిగి ఆఫీసులకి రావాలని కోరుతున్నట్లు తెలిపింది. అయితే ప్రతిరోజూ కాకుండా వారంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆఫీసులకు రావలసి ఉంటుందని పేర్కొంది. దీని కోసం కంపెనీ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల(Electric Scooter) నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను  అందించింది. ఆఫీసులకు తిరిగి రావడానికి ఎంచుకునే ఉద్యోగులకు ఈ-స్కూటర్లను అందించడానికి గూగుల్ సంస్థ యునాగి (Unagi)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ- స్కూటర్ అర్హత సాధించేందుకు ఉద్యోగులు నెలలో కేవలం తొమ్మిది రోజులు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. టెక్ దిగ్గజం ఒక్కో యూనిట్‌కి 50 డాలర్లు (సుమారు రూ. 3800) ఎన్‌రోల్‌మెంట్ చార్జ్, ప్రతి ఉద్యోగికి డిస్కౌంట్ 44.10 డాలర్లు (సుమారు రూ. 3346) నెలవారీ చార్జ్ చెల్లిచేందుకు సిద్ధమైంది.

ఈ- స్కూటర్ల ప్రత్యేకత..

యునాగి మోడల్ వన్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఈ మోటర్లు 1.3 హెచ్‌పి పవర్, 32 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 32 కి.మీ గా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే దాదాపు 25 కి.మీల దూరం ప్రయాణిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పరిచయం చాలా కాలం పాటు హోమ్ షెడ్యూల్ తర్వాత ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి వచ్చేందుకు ప్రోత్సాహకంగా నిలవనున్నాయి. 2020 కొవిడ్ ప్రారంభమైన నాటి నుంచి గూగుల్ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సదుపాయం గూగుల్ మౌంటైన్ వ్యూ ప్రధాన కార్యాలయంతో పాటు సీటెల్, కిర్క్‌ల్యాండ్, ఇర్విన్, సన్నీవేల్, ప్లేయా విస్టా, ఆస్టిన్, న్యూయార్క్ సిటీ లోని క్యాంపస్ లలో అందుబాటులో ఉండనుంది.

యునాగి వ్యవస్థాపకుడు, సీఈ‌వో డేవిడ్ హైమాన్ మాట్లాడుతూ “ఉద్యోగుల్లో భయాందోళనలు ఉన్నాయని గూగుల్ కి తెలుసు. ప్రజలు నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అలవాటు చేసుకున్నారు. అయితే వారు తిరిగి ఆఫీసులకి వచ్చే అనుభవాన్ని మెరుగుపరచడానికి  మేము చేయగలిగినదంతా చేస్తున్నాము. ఇతర కంపెనీలు కూడా దీనిని అనుకరిస్తాయని మేము ఆశిస్తున్నాము. ఇది ఆఫీసులకు గొప్ప ప్రయోజనం అని మేము భావిస్తున్నాము”అని అభిప్రాయపడ్డారు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Forex Reserves: భారత్ వద్ద భారీగా క్షీణించిన విదేశీ మారక నిల్వలు.. వరుసగా నాలుగు వారాల్లో ఎంత తగ్గాయంటే..

Interest Rates: వడ్డీ రేట్ల ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుందో తెలుసా.. ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటంటే..