Layoffs: ఐటీ బతుకులన్నీ లూటీనే.. వరుసగా షాకిస్తున్న దిగ్గజ సంస్థలు.. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ..

|

Jan 29, 2023 | 11:00 AM

లేఆఫ్ ప్రక్రియలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ.. దాదాపు 12 వేల మందిని ఒకేసారి తీసేసిన గూగుల్.. కనీసం కనికరం లేకుండా భార్యాభర్తలకు ఒకే సారి పింక్ స్లిప్స్ ఇచ్చేసింది. డ్యూటీలో జాయినైన రోజే.. జాబ్ ఊస్టింగ్ ఆర్డర్ అందుకున్న మరో ఉద్యోగి పరిస్థితి కూడా ఇదే..

Layoffs: ఐటీ బతుకులన్నీ లూటీనే.. వరుసగా షాకిస్తున్న దిగ్గజ సంస్థలు.. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ..
It Employees Layoff
Follow us on

ఓ వైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు విపత్కర పరిస్థితుల మధ్య ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ లేఆఫ్ బాట పడుతుండటం ఉద్యోగుల్లో తీవ్ర కలవరానికి గురిస్తోంది. గూగుల్ లాంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న కంపెనీల రాత్రికిరాత్రే ఉద్యోగులను తొలగిస్తుండటం ఐటీ సిబ్బందిలో ఆందోళనలకు దారితీసింది. ఏం జరుగుతుందో.. రిక్రూటర్స్‌కే తెలీయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఉద్యోగంలోనుంచి తీసేసినట్లు తెలియక.. వెబ్ సైట్ లోకి లాగిన్ అవుదామంటే అదీ వీలు కుదరడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. వారంలోనే జీతం జీతం పెంచుతామన్నారు.. అంతలోనే జాతకం మార్చేశారంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. లేఆఫ్ ప్రక్రియలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాద గాథ.. దాదాపు 12 వేల మందిని ఒకేసారి తీసేసిన గూగుల్.. కనీసం కనికరం లేకుండా భార్యాభర్తలకు ఒకే సారి పింక్ స్లిప్స్ ఇచ్చేసింది. డ్యూటీలో జాయినైన రోజే.. జాబ్ ఊస్టింగ్ ఆర్డర్ అందుకున్న మరో ఉద్యోగి పరిస్థితి కూడా ఇదే.. ఇలా ఎన్నో వార్తలు ప్రస్తుతం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. ఉద్యోగాల్లో నుంచి ఆకస్మిక తొలగింపులు ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే అనేక కథలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందని.. కడసారి ఆమెను చూసుకునేందుకు సెలవు పెట్టిన ఉద్యోగిని గూగుల్ రాత్రికిరాత్రే తీసేసింది. గూగుల్‌లో వీడియో ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్న పాల్ బేకర్, సంరక్షకుని సెలవులో ఉన్నప్పుడు ఉద్యోగంలోనుంచి తీసేసినట్లు వెల్లడించారు. అతని ల్యాప్‌టాప్‌కు కనెక్షన్ పోయింది.. ఈ క్రమంలో తన ఇంటి కంప్యూటర్‌ను ఉపయోగించి చెక్ ఇన్ చేసినప్పుడు, ఇటీవల ఆయన్ను కూడా తొలగించారని అతనికి తెలిసింది.

ప్రసవం అయ్యి ఆస్పత్రిలో ఉండగానే ఓ మహిళపై వేటు పడింది. ఇలాంటి పరిస్థితులు మరొక భాగస్వామికి ఉపాధిని కోల్పోవడానికి దారితీశాయి. బేకర్ తన తల్లికి టెర్మినల్ క్యాన్సర్ ఉందని, ఆమె సంరక్షణ కోసం తాను ఒక నెల పనికి సెలవు తీసుకున్నానని వెల్లడించాడు. అతను సెలవులో ఉన్నప్పుడు సహద్యోగి తొలగింపుల గురించి చెప్పాడని పేర్కొన్నాడు.

భారీ తొలగింపులు ప్రకటించిన కొద్దిసేపటికే తన పని ల్యాప్‌టాప్ డిస్‌కనెక్ట్ అయిందని బేకర్ గ్రహించాడు. దీంతో ఇంట్లో ఉన్న కంప్యూటర్ నుంచి మెయిల్‌ను తనిఖీ చేశాడు. అప్పుడు తొలగింపుల ప్రభావం తనపై కూడా ఉందని తెలుసుకున్నాడు.

హృదయ విదారకమైన కథనాలను చదివాను..

“చాలా హృదయ విదారకమైన కథనాలను చదివాను.. శుక్రవారం నాడు 12 వేల మంది ఉద్యోగులను Google తొలగించిందని తెలుసుకున్న తర్వాత, నేను నా అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రాణాంతకమైన అనారోగ్యంతో ఉన్న అమ్మ కోసం కేరర్ లీవ్‌లో ఉన్నప్పుడు నా ఉద్యోగాన్ని నేను కోల్పోయాను. అసలు తాను షాక్ లో ఉన్నా.. తర్వాత సంస్థ మరో షాక్ ఇచ్చింది. విచారం ఏర్పడింది. కెరీర్‌లో ఇది అత్యంత బాధకరమైన విషం” అని బేకర్ లింక్డ్‌ఇన్‌లో రాశారు.

బేకర్ ప్రకారం, గూగుల్‌లో చాలా మంది ఉద్యోగులు ఇదే బాటలో ఉన్నారనుకున్నాడు. కానీ తనకేం కాదనుకున్నాడు. తొలగింపులకు విరుద్ధంగా వ్యాపారం ఇతర వ్యయ-కటింగ్ కార్యక్రమాలను అమలు చేస్తుందని అతను ఊహించాడు. అతను Google ప్రకటనల కోసం పనిచేసినందున, కార్పొరేషన్‌కు ఆదాయాన్ని అందించే విభాగం కావున.. అతను సురక్షితంగా ఉంటాడని విశ్వసించాడు. కానీ అలా జరగలేదు..

అక్కడ కూడా పొమ్మన్నారు..

గూగుల్ మాతృసంస్థ ఆల్భాబెట్ తీసేసిన 12 వేల మంది ఐటీయుల్లో నేనూ ఒకణ్ణి. చేరిన రెండు నెలల్లోనే ఉద్యోగం పోయింది. ఆ తర్వాత గత సెప్టెంబర్‌లో స్నాప్‌లో చేరితే అక్కడా తీసేశారు. నవంబర్‌లో అమెజాన్‌లో చేరితే అక్కడా వెళ్లిపొమ్మన్నారు.

నా డ్రీమ్ కంపెనీలో చేరాను.. కానీ..

గూగుల్ నా డ్రీమ్ కంపెనీ. ఏడాది కిందటే జాబ్ వచ్చింది. కానీ నా సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. గూగుల్ లేఆఫ్ ప్రభావం నన్ను కూడా మింగేసింది. ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు

అవసరానికి మించి ఉద్యోగుల్ని తీసుకున్నాం.. ఇప్పుడు పశ్చాత్తాప్పడుతున్నామంటూ ఉద్యోగుల తొలగింపుపై గూగుల్ సంస్థ ప్రకటించింది. కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ.. ఉద్యోగుల తొలగింపు వెనుక ఒక కారణం ఓవర్‌హైరింగ్ అని పేర్కొన్నారు. కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుపై కఠినంగా వ్యవహరించవల్సి వస్తోందన్నారు. కొవిడ్‌-19 పరిణామాల సమయంలో, అప్పటి అవసరాలకు తగ్గట్లుగా అధిక నియామకాలు చేపట్టామని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసాధారణ నైపుణ్యమున్న ఉద్యోగులకూ వీడ్కోలు చెప్పాల్సి వస్తోందని, దీనిపై క్షమాపణలు చెబుతున్నట్లు పిచాయ్‌ వివరించారు. గత రెండేళ్ల నుంచి కంపెనీ ఆశించినంత మందంజలో ఉండటంతో అనేక మందిని నియమించుకున్నట్లు చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..