మేము సాయం చేస్తాం-గూగుల్ పే

ఎస్ఎంఈ రుణాలు పొందేందుకు తాము సహకరిస్తామని గూగుల్ పే ప్రకటించింది. కొవిడ్ సంక్షోభం నుంచి చిన్న సంస్థలు కోలుకునేందుకు గూగుల్ తల పెట్టిన నూతన పథకాల్లో ఇది ఒకటని సంస్థ తెలిపింది...

మేము సాయం చేస్తాం-గూగుల్ పే
Follow us

|

Updated on: Jun 26, 2020 | 8:48 AM

కరోనా సమయంలో “గూగుల్ పే” తన పెద్ద మనసు చాటుకుంది. చిన్న, మధ్యస్థాయి వ్యాపారస్థులకు సహకరించేందుకు ముందుకు వచ్చింది. ఎస్ఎంఈ రుణాలు పొందేందుకు తాము సహకరిస్తామని “గూగుల్ పే” ప్రకటించింది. కొవిడ్ సంక్షోభం నుంచి చిన్న సంస్థలు కోలుకునేందుకు “గూగుల్” తల పెట్టిన నూతన పథకాల్లో ఇది ఒకటని సంస్థ తెలిపింది. దేశ వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా వ్యాపారులు, నగదు వసూళ్లు, చెల్లింపుల కోసం తమ బిజినెస్ యాప్ ని వినియోగిస్తున్నారని వెల్లడించింది. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు ఏమేమి ఫైనాన్స్ ఆఫర్లు ఇస్తున్నాయో, గూగుల్ పే ద్వారా ఏమి ఇవ్వగలమో తెలియచేస్తామని గూగుల్ తెలిపింది. ఇది త్వరలోనే అమలు కానుందని పేర్కొంది.

ఇదిలావుంటే.. గూగుల్‌ పే థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ మాత్రమేనని.. ఇది ఎలాంటి పేమెంట్‌ వ్యవస్థను నిర్వహించదని తాజాగా ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఎన్‌పీసీఐ ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో గూగుల్ పే లేదని వెల్లడించింది.