‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

'గూగుల్ పే' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా కోట్ల మంది ఈ గుగూల్ పేను ఉపయోగిస్తున్నారు. బిల్స్, రీచార్జులు, పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్‌ లాంటి ఎన్నో సేవల్ని గూగుల్ పే అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ ఇప్పుడు క్రెడిట్ బిజినెస్‌లో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు...

'గూగుల్ పే'లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..
Google Pay
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 26, 2020 | 1:19 PM

‘గూగుల్ పే’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా కోట్ల మంది ఈ గుగూల్ పేను ఉపయోగిస్తున్నారు. బిల్స్, రీచార్జులు, పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్‌ లాంటి ఎన్నో సేవల్ని గూగుల్ పే అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ క్రెడిట్ బిజినెస్‌లో అడుగుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అప్పులు ఇచ్చే ఆలోచన చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు గూగుల్ పే యాజమాన్యం పేర్కొంది. ఇందు కోసం ఈ సంస్థ ఇండియాలోని టాప్ లెండర్స్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది.

గుగూల్ పే ఫ్లాట్ ఫామ్‌ ద్వారా తక్కువ వడ్డీకి మొదట ఓ 30 లక్షల మంది వరకూ ఇన్‌స్టంట్ క్రెడిట్ అంటే తక్షణమే అప్పు ఇచ్చే సదుపాయాన్ని ప్రారంభించనుందట. ఇప్పటికే కన్స్యూమర్ లోన్స్ ఇచ్చేందుకు యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్. మరి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వాలనుకునే రుణాల కోసం.. ఏయే బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనుందో ఇంకా తెలియాల్సి ఉంది.

Read More: 

కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు