
జీమెయిల్ లోని కొన్ని సాంకేతిక లోపాలను క్యాష్ చేసుకున్న సైబర్ నెరగాళ్లు దాడులకు పాల్పడినట్లు తాము గుర్తించినట్లు పేర్కొంది. గూగుల్ ఫోన్ కాల్స్, ఫాలో అప్ ఈ-మెయిల్స్ మీరు గుర్తించలేని విధంగా వారు ఏఐ సాయంతో పంపిస్తున్నారని, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిషింగ్ లింక్ లపై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. జీమెయిల్ పై సైబర్ దాడిని గుర్తించిన గూగుల్ వెంటనే సెక్యూరిటీ అప్ డేట్ ను రిలీజ్ చేసింది. వెంటనే జీమెయిల్ యూజర్లు తమ పాస్ వర్డ్ లను వాడటం మానేయాలని సూచించింది. పాస్ వర్డ్ ఛేంజ్ చేసుకోవాలని సూచించింది.
కొన్ని ఆన్ లైన్ రిపోర్టుల ప్రకారం సైబర్ నేరగాళ్లు జీమెయిల్ అకౌంట్లను హ్యాక్ చేసి, పాస్ వర్డ్ లను, పాస్ వర్డ్ రికవరీ ఆప్షన్లను మార్చేస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ డేంజరస్ లింక్ లపై క్లిక్ చేయొద్దని గూగుల్ హెచ్చరించింది. అయితే ఒకవేళ మీ పాస్ వర్డ్ మారిపోయినా.. రికవరీ ఫోన్ నంబర్ లేదా.. రికవరీ ఈ-మెయిల్ ద్వారా దానిని సెట్ అప్ చేయొచ్చని సూచించింది.
ఈ సైబర్ దాడి ముందుగా ఈ డెవలపర్ పై జరిగింది. తన అకౌంట్ కు లీగల్ నోటీసు జారీ అయ్యిందని పేర్కొంటూ గూగుల్ నుంచి ఈ మెయిల్ వచ్చిందని, ఆ మెయల్ కింద నో రిప్లై అని కూడా రావడంతో అచ్చం ఈమెయిల్ అధికారిక మెయిల్ అనే ఆ డెవలపర్ అనుకున్నారు. అందుకే డీకేఐఎం(డోమైన్ కీస్ ఐడెంటిఫైడ్ మెయిల్) సిగ్నేచర్ కూడా ఉండటంతో ఆ వ్యక్తి అది జీమెయిల్ రెగ్యూలర్ సెక్యూరిటీ హెచ్చరిక అని నమ్మారు. నిజానికి హ్యాకర్లు గూగుల్ వ్యవస్థలోని ఓ టెక్నికల్ లోపాన్ని ఆసరాగా చేసుకొని అథంటికేషన్ కలిగిన మెయిల్ గా దానిని పంపారు. దీని ఉద్దేశం ఏమిటంటే యూజర్ల నుంచి లాగిన్ వివరాలను దొంగిలించడం.. ఆ తర్వాత వ్యక్తిగత డేటాను హ్యక్ చేయడం.
ప్రస్తుతం పాస్ వర్డ్ లు, ఎస్ఎంఎస్ ఆధారిత టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ లను హ్యార్లు సులభంగా హ్యాక్ చేస్తున్నారు. వీటి సాయంతో వారు ఏ డివైజ్ నుంచైనా మీ అకౌంట్ కు లాగిన్ అవ్వచ్చు. అందుకే వినియోగదారులకు గూగుల్ పాస్ కీ ని సెట్ చేసుకోవాలని సూచిస్తోంది. వినియోగదారుల డివైజ్ లోనే ఫింగర్ ప్రింట్ లేదా పిన్ వంటివి సెట్ చేసుకోవడం ద్వారా పాస్ కీ పని చేసే విధంగా సెట్ చేసుకోవాలని చెబుతోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి