LIC Housing Finance: కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు సొంత ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి కస్టమర్ల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీలో హోమ్ లోన్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ సంస్థలు తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. ఏకంగా ఆరు నెలలకు సమానమైన హోమ్ లోన్ ఈఎంఐ (EMI)లను రద్దు చేస్తామని ఆ సంస్థ వెల్లడించింది. హోమ్ లోన్ ప్రొడక్ట్‌ను ఎంచుకున్న కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. నెలవారీ జీతం పొందే ఉద్యోగులు, డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీం (DBPS) పరిధిలోకి వచ్చే పెన్షనర్లు ఈ పథకానికి అర్హులు.
అయితే ఈ కొత్త ఆఫర్ ప్రకారం 37, 38, 73, 74, 121, 122వ EMIలకు మినహాయింపు ఉంటుంది. బకాయి ఉన్న ఈఎంఐలు, తరువాతి నెలల ప్రిన్సిపల్ అమౌంట్‌కు యాడ్ చేసిన మొత్తాన్ని ఆఫర్‌లో భాగంగా రద్దు చేస్తారు. డిఫైన్డ్ బెనిఫిట్స్ పెన్షన్ స్కీమ్ ప్రకారం.. పెన్షన్‌కు అర్హత ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్‌యూ, బ్యాంకు డిఫెన్స్ ఇతర ఉద్యోగులు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులని ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. గృహ వరిష్టకు దరఖాస్తు చేసుకునేవారికి 65 ఏళ్ల వరకు ఉండవచ్చు. కస్టమర్లకు 80 సంవత్సరాలు వచ్చే వరకు లేదా లోన్ గడువు అత్యధికంగా 30 సంవత్సరాల వరకు రెండింట్లో ఏది ముందు వస్తే అంత వరకు లోన్ టెన్యూర్ ఉంటుంది.
గృహ వరిష్ట పథకాన్ని గత ఏడాది జులై నెలలో ప్రారంభించారు. అప్పటి నుంచి దీనికి మంచి స్పందన లభిస్తోందని ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అధికారులు తెలిపారు. అయితే తాజాగా ప్రకటించిన ఆరు EMIల రద్దు ఆఫర్‌ను కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్‌గా అందిస్తామని ఎల్‌ఐసీ చెబుతోంది. LIC హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇప్పటి వరకు 15,000 హోమ్ లోన్లను అందించింది. వీటి విలువ రూ.3,000 కోట్ల వరకు ఉంటుంది. సిబిల్ స్కోరు 700, అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు 6.9 శాతం ప్రారంభ వడ్డీతో రూ.15 కోట్ల వరకు హోమ్ లోన్లు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.’
ఇవీ చదవండి: పుట్టిన 24 గంటల్లో చనిపోతాడని అనుకున్నారు.. కానీ ఇప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు.. అతడెవరంటే.!