
2025 కేంద్ర బడ్జెట్‌లో హామీ ఇచ్చినట్లుగా చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి సమస్య నుంచి రక్షణ కల్పించేలా ఏప్రిల్ నుంచి రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను అందించేందుకు కేంద్ర కీలక చర్యలను తీసుకుంది. ఈ సౌకర్యం రాబోయే కొన్ని సంవత్సరాలలో మైక్రో-ఎంట్రప్యూనర్స్‌కు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఈ స్కీమ్ ఉండనుంది. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి, క్రెడిట్ కార్డు పొందడానికి వ్యాపారుస్తులు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి వ్యాపారులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను తెలుసుకుందాం.
రూ. 5 లక్షల పరిమితి కలిగిన క్రెడిట్ కార్డు దుకాణాలను నిర్వహించే, కుటీర పరిశ్రమల యజమానులకు అందుబాటులో ఉంటుంది. అయితే యజమానులకు వారి యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, వ్యాపార పరిస్థితుల అంచనా తర్వాత క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. ఈ కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.
కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో ముఖ్యంగా చిన్న వ్యాపార యజమానులకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డుల సదుపాయం కల్పించింది. అలాగే ఈ బడ్జెట్‌లో రైతులు, మధ్యతరగతికి ప్రజలకు అనేక రాయితీలను అందుబాటులో ఉంచింది. అలాగే వారి నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి రూపొందించిన ముఖ్యమైన పథకాలను కూడా ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి