SBI FD: ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సీనియర్ సిటిజెన్స్‌కు ఇక పండగే..

|

Apr 04, 2023 | 6:00 PM

ఎస్‌బీఐ వీకేర్ సీనియర్ సిటిజెన్ ఎఫ్‌డీ గడువు గత నెల మార్చి 31తోనే ముగిసిపోయింది. కానీ ఎస్‌బీఐ ఈ స్కీమ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు అంటే జూన్ 30వ తేదీ వరకూ సీనియర్ సిటిజెన్స్ కు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.

SBI FD: ఎస్‌బీఐ నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సీనియర్ సిటిజెన్స్‌కు ఇక పండగే..
Senior Citizen savings scheme
Follow us on

ఫిక్స్‌డ్ డిపాజిట్.. అత్యంత ప్రజాదరణ పొందిన సురక్షిత పెట్టుబడి పథకాలలో ఒకటి. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. మీరు పెట్టిన మొత్తానికి అధిక మొత్తంలో వడ్డీని వస్తుంది. సాధారణ పౌరుల కన్నా సీనియర్ సిటిజెన్స్ కు ఎక్కువ శాతం వడ్డీ వస్తుంది. కొన్ని బ్యాంకులు కేవలం సీనియర్ సిటిజెన్స్ కోసమే ప్రత్యేక ఎఫ్‌డీ పథకాలను ప్రారంభిస్తాయి. ఇదే కోవలో కొన్నేళ్ల క్రితమే దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సీనియర్ సిటిజెన్స్ కోసం ఎస్‌బీఐ వీకేర్ సీనియర్ సిటిజెన్ ఎఫ్‌డీ(SBI We care Senior Citizen FD)ని ప్రారంభించింది. దీని ద్వారా అధిక వడ్డీతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు బ్యాంకు అందిస్తోంది. విషయం ఏమిటంటే ఈ పథకం గడువు గత నెల మార్చి 31తోనే ముగిసిపోయింది. అంటే ఇక మీదట ఆ పథకంలో ఖాతా తెరవడానికి వీలు పడదు. కానీ ఎస్‌బీఐ ఈ స్కీమ్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు అంటే జూన్ 30వ తేదీ వరకూ సీనియర్ సిటిజెన్స్ కు ఈ వీ కేర్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కొత్త ఎఫ్ డీ ఖాతా ప్రారంభించాలనుకొనే వృద్ధులకు ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అసలు ఈ స్కీమ్ ఎంటి? దీనిలో వడ్డీ శాతం ఎంత? ఇతర ప్రయోజనాలు ఏంటి? ఖాతా ఎలా ప్రారంభించాలి వంటి వివరాలు తెలుసుకుందాం..

ఎస్బీఐ లక్ష్యం ఇదే..

ఎస్‌బీఐ వీకేర్ పథకాన్ని 2020, మే నెలలో తొలుత ప్రారంభించారు. అదే సంవత్సరం సెప్టెంబర్ తోనే పథకం గడువు ముగిసింది. అయితే దఫ దఫాలుగా పథకం గడువు పెంచుకుంటూ వచ్చిన ఎస్ బీఐ దాదాపు మూడేళ్లు కొనసాగించింది. ఇప్పుడు మరోసారి దాని గడువును పెంచుతూ 2023 జూన్ వరకూ సీనియర్ సిటీజనులకు అవకాశం కల్పించింది. సీనియర్ సిటిజన్స్ కోసం వారికి అధిక రాబడి అందించడమే లక్ష్యంగా ఎస్‌బీఐ వీ కేర్ డిపాజిట్ పథకాన్ని అందిస్తున్నట్లు బ్యాంక్ తన వెబ్ సైట్ లో తెలిపింది. సీనియర్ సిటీజనులతో తమ బంధాన్ని మరి కొన్నాళ్లు కొనసాగించేందుకే గడువు పెంచామని చెప్పింది. ఈ స్పెషల్ స్కీమ్ మరో మూడు నెలలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

అధిక ప్రయోజనాలు.. ఈ ప్రత్యేక పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది. రెగ్యులర్‌గా ఇతర ఎఫ్‌డీ పథకాలపై సీనియర్ సిటిజన్లకు అందించే అదనపు 50 బేసిస్ పాయింట్లు కాకుండా మరో 50 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ ఈ స్కీమ్ ద్వారా అందుతుంది. అంటే రెగ్యులర్ కస్టమర్ల కన్నా 100 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ పొందవచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎలా ప్రారంభించాలి.. ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను నెట్ బ్యాంకింగ్ లేదా నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి కూడా తీసుకోవచ్చు. అలాగే స్టేట్ బ్యాంక్ యోనో యాప్ ద్వారా స్కీమ్‌లో జాయిన్ కావచ్చు.

వడ్డీ ఎంతంటే.. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై3.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది బ్యాంక్. 7 రోజుల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ గల ఎఫ్‌డీ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు టెన్యూర్లపై 7.3 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల టెన్యూర్‌పై 7.5 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల టెన్యూర్ ఎఫ్‌డీలపై 7 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఏడాది లోపు డిపాజిట్లకు 3.5 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

రుణ సదుపాయం.. దీంతో పాటు ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ తెరిస్తే లోన్ సౌకర్యం కూడా లభిస్తుంది. అయితే, రుణాలపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..