Gold Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Gold Price Today: ఎక్కువగా 24 క్యారెట్ల బంగారం కాకుండా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. అయితే కొంతమంది 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఆభరణాలను పొందుతారు. మీ ఆభరణాలపై గుర్తించబడిన హాల్‌మార్క్ ద్వారా మీరు బంగారం..

Gold Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..
శుక్రవారం రూపాయి మొదటిసారిగా 88 మార్కును దాటి US డాలర్‌తో పోలిస్తే 88.19 (తాత్కాలిక) వద్ద ఆల్-టైమ్ కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. భారతదేశం -US మధ్య వాణిజ్య ఒప్పందంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య రూపాయి 61 పైసలు పడిపోయింది. ఈ వారంలో బంగారం ధరలు రూ.3,300 లేదా 3.29 శాతం పెరిగాయి.

Updated on: Jul 09, 2025 | 4:00 PM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులకు లోవుతుంటుంది. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతూ ఉంటుంది. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే ఇటీవల తులం బంగారం ధర లక్ష రూపాయలకుపైగా వెళ్లగా, తర్వాత క్రమంగా దిగి వచ్చాయి. గత రెండు రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు.. ఇప్పుడు భారీగా దిగి వచ్చింది. జూలై 9వ తేదీన మధ్యాహ్నం సమయానికి తులం బంగారంపై ఏకంగా 660 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,180 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల తులం ధర 90,000 వేల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర Rs 1,10,000 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. కేవలం లక్ష పెట్టుబడితో రూ.1.5 కోట్ల రాబడి

హాల్‌మార్క్ అనేది నిజమైన బంగారం గుర్తింపు:

ఇవి కూడా చదవండి

హాల్‌మార్క్ చూసిన తర్వాతే ఆభరణాలను కొనండి. ఎందుకంటే ఇది బంగారానికి ప్రభుత్వ హామీ. భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌ను నిర్ణయిస్తుంది. ప్రతి క్యారెట్‌కు హాల్‌మార్క్ గుర్తులు భిన్నంగా ఉంటాయి. బంగారం కొనడానికి ముందు దీన్ని గుర్తుంచుకోండి. మీరు ఇలా చేయకపోతే మీ బంగారం కల్తీ కావచ్చు. అందుకేఎల్లప్పుడూ దానిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే కొనండి.

ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ఆ ప్రభుత్వం!

ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు:

ఎక్కువగా 24 క్యారెట్ల బంగారం కాకుండా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. అయితే కొంతమంది 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఆభరణాలను పొందుతారు. మీ ఆభరణాలపై గుర్తించబడిన హాల్‌మార్క్ ద్వారా మీరు బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 అని ఉంటుంది.

ఇది కూడా చదవండి: Jio Plan: జియోలో దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.1958 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

ఇది కూడా చదవండి: iPhone 16: ఆపిల్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌.. కేవలం రూ.50 వేలకే ఐఫోన్‌ 16

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం