Vande Bharat Sleeper: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ఏ మార్గంలో అంటే..

Vande Bharat Sleeper: ఇప్పటికే నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. అందుకే ఇప్పుడు స్లీపర్ వెర్షన్‌ను కూడా తీసుకురావడానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. ఇప్పటికే ఈ స్లిపర్‌ రైళ్లు ట్రాయల్స్‌లో సక్సెస్‌..

Vande Bharat Sleeper: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. ఏ మార్గంలో అంటే..

Updated on: Nov 28, 2025 | 12:29 PM

Vande Bharat Sleeper: ప్రయాణికుల కోసం భారత రైల్వే ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. హైస్పీడ్‌ రైళ్లను సైతం ప్రవేశపెడుతోంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు ప్రయాణికులు. ఇప్పటికే పట్టాలెక్కాల్సిన వందేభారత్‌ స్లిపర్‌ రైళ్లు.. కానీ కొన్ని కారణాల వల్ల లాంఛింగ్ ఆలస్యమైంది. డిసెంబర్‌లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపైకెక్కేందుకు సిద్ధం చేస్తోంది కేంద్రం. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

విజయవాడ మీదుగా..

కాగా, మొదటి వందేభారత్‌ స్లిపర్‌ రైలు విజయవాడ డివిజన్ మీదుగా నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడ–సికింద్రాబాద్, విజయవాడ–విశాఖపట్నం లాంటి బాగా రద్దీ ఉండే మార్గాల్లో నడిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. అయితే పర్మిషన్‌ వస్తే వచ్చే నెల డిసెంబర్‌లో ప్రారంభించనుంది. ఏపీ ప్రాంతంలో రైళ్ల నిర్వహణపై త్వరలో స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: 2026 Holidays List: ఉద్యోగులు, విద్యార్థుల గుడ్‌న్యూస్‌.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. జాబితా విడుదల

ఇవి కూడా చదవండి

వందేభారత్‌పై మంచి స్పందన:

ఇదిలా ఉండగా, ఇప్పటికే నడుస్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. అందుకే ఇప్పుడు స్లీపర్ వెర్షన్‌ను కూడా తీసుకురావడానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. ఇప్పటికే ఈ స్లిపర్‌ రైళ్లు ట్రాయల్స్‌లో సక్సెస్‌ అయ్యాయి. ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉండేలా రూపొందించింది. అయితే ట్రయల్స్‌ తర్వాత సీట్లలో కొన్ని మార్పులు చేశారు. లోపలి ఇంటీరియర్ కూడా ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా మార్చారు. టెక్నాలజీతో కూడిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసింది రైల్వే.

ఇది కూడా చదవండి: Insurance: కేవలం ఏడాదికి 20 రూపాయల ప్రీమియంతో 2 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!

ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ టూ టియర్, ఏసీ త్రీ టియర్ కోచ్‌లు అందులో ఉంటాయి. మొత్తం 823 బెర్తులు ఉన్నాయి. ఏసీ త్రీ టియర్‌లో 611, ఏసీ టూ టియర్‌లో 188, ఫస్ట్ క్లాస్‌లో 24 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ ఏసీ కోచ్‌లో హాట్ వాటర్ షవర్, ఆధునిక ఇంటీరియర్, మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. దీర్ఘ ప్రయాణాల్లో ప్రయాణికులు సౌకర్యంగా నిద్రపోయేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ స్లిపర్‌ రైళ్లలో విమానం లాంటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు గతంలో కేంద్ర మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ వెల్లడించారు. విమాన కేబిన్‌లా కనిపించే ఇంటీరియర్, వై-ఫై సదుపాయం, USB చార్జింగ్ పోర్టులు, రీడింగ్ లైట్స్, CCTV కెమెరాలు, డిస్‌ప్లే ప్యానెల్స్ ఇలా ఎన్నో రకాల సదుపాయాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి