భారతదేశంలో స్థిరమైన పెట్టుబడి ఎంపికగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రాచుర్యం పొందాయి. పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా రాబడికి హామీ ఉండడంతో ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజలు బ్యాంకుల ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతున్నారు. గత రెండేళ్లుగా బ్యాంకులు వడ్డీ రేట్లను నిరంతరం పెంచడం వల్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టుబడిదారులు పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. అయితే బ్యాంకుల మధ్య పెరిగిన పోటీ కారణంగా క్నొఇ బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎఫ్‌డీలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రత్యేక ఎఫ్‌డీ ఆఫర్ల కింది కొన్ని బ్యాంకులు పెట్టుబడిదారులుకు 9 శాతం కంటే ఎక్కువ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.రూ. 3 కోట్ల కంటే ఎక్కువ మొత్తాలకు సీనియర్ సిటిజన్ ఎఫ్‌డిలపై 9.5 శాతం వరకు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పెట్టుబడిదారులకు అధిక వడ్డీను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ఒక సంవత్సరంలో ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ రూ. 40,000 దాటితే, టీడీఎస్ డిడక్ట్ చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు, వడ్డీ రూ. 50000 దాటితే 10 శాతం టీడీఎస్ డిడక్ట్ చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..