SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే ఉచితంగానే రూ.2 లక్షల బీమా.. వివరాలు తెలుసుకోండి

|

Nov 07, 2021 | 7:20 AM

Good News For SBI Customers: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తోంది. ఈ సేవల్లో జన్ ధన్ అకౌంట్

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే ఉచితంగానే రూ.2 లక్షల బీమా.. వివరాలు తెలుసుకోండి
Sbi
Follow us on

Good News For SBI Customers: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్‌.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తోంది. ఈ సేవల్లో జన్ ధన్ అకౌంట్ కూడా భాగంగా ఉంది. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. వాటిలో భీమా ప్రధానమైనది. జన్‌ధన్‌ ఖాతా ఉన్న ఆరు రూ.2 లక్షల వరకు ఉచిత బీమా ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాకుండా, భారతదేశం వెలుపల ప్రమాదం సంభవించినప్పటికీ.. నామినీ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే.. ఆగస్ట్ 28, 2018లోపు జన్‌ ధన్‌ యోజనా ఖాతాలను తెరిచిన వినియోగదారులకు రూ.1 లక్ష మాత్రమే భీమా ఉంది. ఆ ఈ తేదీ తర్వాత జన్ ధన్ ఖాతాలను తెరిచిన వ్యక్తులకు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమాను పొందవచ్చు. SBI రూపే జన్ ధన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఉచిత బీమా పథకం వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ పథకాన్ని పొందాలనుకునే ఖాతాదారులు బ్యాంకులో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాను తెరవాలి లేదా.. వారు ముందు నుంచే ఖాతాను కలిగి ఉండాలి.

ప్రధాన్ మంత్రి జన్-ధన్ యోజన (PMJDY) అనేది ప్రతీఒక్కరికీ ఖాతాలు ఉండాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. ఈ పథకం ప్రాథమిక సేవింగ్స్, బ్యాంక్ ఖాతా లభ్యత, క్రెడిట్ యాక్సెస్, చెల్లింపుల సౌకర్యం, మినహాయించబడిన వర్గాలు లేదా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు బీమా, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను అందించడం లక్ష్యంగా కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. జన్ ధన్ యోజన కింద SBI ఖాతాదారులు తమ ఖాతాలను తెరిచేటప్పుడు ఎలాంటి డబ్బును డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. దీంతోపాటు రూపే డెబిట్ కార్డులను పొందవలసి ఉంటుంది. జీవిత బీమాతో పాటు, రూపే డెబిట్ కార్డ్ హోల్డర్లు కూడా ఈ రక్షణ ప్రయోజనాలు, ఇతర సేవలను పొందడానికి అర్హులు.

ఎస్‌బి జన్ ధన్ ఖాతాలో బీమా రక్షణ ప్రయోజనాలను పొందడానికి.. మరణించిన (కస్టమర్) వారి కుటుంబసభ్యులు ముందుగా క్లెయిమ్ ఫారమ్‌ను పూరించాలి. దానితో పాటు బీమా క్లెయిమ్ చేయాల్సిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం కాపీని జతచేయాలి. ప్రమాదానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక, మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. బీమాను క్లెయిమ్ చేయడానికి ప్రమాదం జరిగిన 90 రోజులలోపు అన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

Also Read:

SBI ATM: మీరు ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? మీ మొబైల్‌ను వెంట ఉంచుకోండి.. ఎందుకంటే..!

Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే రూ.1.03 కోట్ల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు