Telugu News Business Good news for pensioners, Now life certificate from home, Life Certificate details in telugu
Life Certificate: పింఛన్‌దారులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్
జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని చాలా మంది పేర్కొంటూ ఉంటారు. ఇది పెన్షనర్ల కోసం రూపొందించిన బయోమెట్రిక్ డిజిటల్ సర్వీస్. ఈ సర్వీస్ ద్వారా పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా పింఛన్ అందించడానికి ధ్రువీకరణ ఈ సర్టిఫికెట్ ఆధారంగానే సాగుతుంది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌లను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డిజిటల్‌గా సమర్పించవచ్చు.
జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ అంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని చాలా మంది పేర్కొంటూ ఉంటారు. ఇది పెన్షనర్ల కోసం రూపొందించిన బయోమెట్రిక్ డిజిటల్ సర్వీస్. ఈ సర్వీస్ ద్వారా పెన్షన్ పంపిణీ ప్రక్రియను సులభతరం చేస్తాయి. ముఖ్యంగా పింఛన్ అందించడానికి ధ్రువీకరణ ఈ సర్టిఫికెట్ ఆధారంగానే సాగుతుంది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌లను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా డిజిటల్‌గా సమర్పించవచ్చు. గతంలో పెన్షనర్లు తమ జీవిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించడానికి ప్రతి సంవత్సరం వారి పెన్షన్ పంపిణీ చేసే సంస్థలను వ్యక్తిగతంగా సందర్శించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ రాకతో ఈ ఇబ్బంది తప్పింది. అయితే పెరుగుతున్న టెక్నాలజీకు అనుగుణంగా ఇకపై పింఛన్‌దారులు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను ఇంటి నుంచే పొందే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.
జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్లను పొందడం ఇలా
భారతదేశం అంతటా ఉన్న సీఎస్‌సీ సెంటర్ల ద్వారా జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్లను పొందవచ్చు.
పింఛనుదారులు జీవన్ ప్రమాణ్ పోర్టల్‌ని సందర్శించి ఫింగర్‌ప్రింట్ రీడర్‌ని ఉపయోగించి వేలిముద్రల ఉపయోగంతో వారి లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సమర్పించవచ్చు.
జీవన్ ప్రమాణ్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాప్ ద్వారా తమ జీవిత ధ్రువీకరణ పత్రాన్ని కూడా అందించవచ్చు.
పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు, ట్రెజరీ మొదలైన పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీల కార్యాలయం ద్వారా జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్లను పొందవచ్చు.
దేశంలోని కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న ‘డోర్‌స్టెప్ బ్యాంకింగ్’ ద్వారా కూడా పింఛనుదారులు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఈ సేవ 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు లేదా వారి సర్టిఫికేట్‌లను సమర్పించడంలో వారికి సహాయపడటానికి మొబిలిటీ సమస్యలు ఉన్న వారికి అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి వారి సర్టిఫికేట్‌లను సమర్పించడానికి పెన్షనర్లు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం గూగుల్‌ప్లే స్టోర్, జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్ పొందవచ్చు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ‘డోర్‌స్టెప్ సర్వీస్ ఫర్ సబ్‌మిషన్ ఆఫ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ బై పోస్ట్‌మ్యాన్’ సేవ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌లను కూడా సమర్పించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి “పోస్ట్ ఇన్‌ఫో యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఈ సేవను ఉపయోగించవచ్చు.