Good News for Paytm users: డబ్బులు జేబులో లేకున్నా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఏమైనా కొనుగోలు చేసుకుని సదుపాయాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే పేటీఎం మరో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. వినియోగదారులు, వ్యాపారుల కోసం పేటీఎం ‘ట్యాప్ టు పే’ (Tap to Pay) ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది వినియోగదారులు వారి పేటీఎం (Paytm) రిజిస్టర్డ్ కార్డ్ ద్వారా కేవలం PoS మెషీన్‌లో వారి ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా తక్షణ చెల్లింపులను చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫోన్ లాక్‌లో ఉన్నా, మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా పేమెంట్స్ చేయొచ్చు. పేటీఎం ఆల్ ఇన్ వన్ PoS పరికరాలు, ఇతర బ్యాంకుల PoS మెషీన్‌ల ద్వారా చెల్లించే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు పేటీఎం ‘ట్యాప్ టు పే’ సర్వీస్ అందుబాటులో ఉంది.
మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా చెల్లింపులు చేసుకొనే సదుపాయాన్ని పేటీఎం తీసుకొచ్చింది. ఇందుకోసం ‘ట్యాప్ టు పే’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది. దీని ద్వారా కస్టమర్లు నగదు లావాదేవీలను పేటీఎం రిజిస్టర్ చేసిన కార్డు ద్వారా పీఓఎస్ మెషీన్‌లో ఫోన్ ట్యాప్ చేసి నగదు పూర్తి చేయవచ్చని కంపెనీ పేర్కొంది.
ఫోన్ లాక్ చేసి ఉన్నా, మొబైల్‌లో డేటా లేకున్నా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండకపోయినా ఈ లావాదేవీలను సులభంగా చేయవచ్చని వివరించింది. ఇది ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ ‘ట్యాప్ టూ పే’ సేవల ద్వారా రిటైల్ స్టోర్ల వద్ద వేగవంతమైన చెల్లింపులకు అవకాశం ఉంటుందని తెలిపింది.
ట్యాప్ టు పే సర్వీసుతో, ఎంచుకున్న కార్డ్‌లోని 16 అంకెల పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) అంటే పాన్ కార్డ్ నెంబర్‌ను సురక్షిత లావాదేవీ కోడ్ లేదా డిజిటల్ ఐడెంటిఫైయర్‌గా మార్చడానికి పేటీఎం దాని బలమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఈ డిజిటల్ ఐడెంటిఫైయర్ వినియోగదారు కార్డ్ వివరాలు వినియోగదారు వద్ద మాత్రమే ఉండేలా చూస్తుంది. ఏ థర్డ్ పార్టీ పేమెంట్ ప్రాసెసర్‌తో ఈ వివరాలను పంచుకోదు పేటీఎం. ఒక వినియోగదారు రిటైల్ అవుట్‌లెట్‌ను సందర్శించినప్పుడు, వారు లావాదేవీ ద్వారా వారి కార్డ్ వివరాలను పంచుకోనవసరం లేకుండా కేవలం PoS పరికరం పై ట్యాప్ చేసి పేమెంట్ చేయొచ్చు.